టెకీని స్తంభానికి కట్టేసి చితకబాదారు.. | Techie beaten up for passing lewd comments in Bengaluru | Sakshi
Sakshi News home page

టెకీని స్తంభానికి కట్టేసి చితకబాదారు..

Published Sat, Apr 2 2016 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

టెకీని స్తంభానికి కట్టేసి చితకబాదారు..

టెకీని స్తంభానికి కట్టేసి చితకబాదారు..

బెంగళూరు: ఓ యువతిని వేధిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కరెంట్ స్తంభానికి కట్టివేసి దుస్తులు చినిగిపోయేలా కొట్టారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

నిందితుడు వివాహితుడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిందితుడు తరచూ తనను ఉద్దేశిస్తూ అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు ఆరోపించింది. శనివారం తన భర్తతో కలసి వచ్చి టెకీని నిలదీసింది. అక్కడున్న స్థానికులకు ఈ విషయం చెప్పింది. దీంతో అందరూ కలసి టెకీని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement