kangana Ranaut Reacts On FIR With Photo And Wine Glass - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: అరెస్ట్‌ చేయడానికి వస్తే ఇంటి దగ్గర నా మూడ్‌ ఇలా.. కంగనా సంచలన పోస్ట్‌

Published Thu, Nov 25 2021 8:41 AM | Last Updated on Thu, Nov 25 2021 12:40 PM

kangana Ranaut Reacts On FIR On Her With Photo And Wine Glass - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తన తీరు, వివాదస్పద వ్యాఖ్యలతో తరచు ఆమె వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా. అంతేకాదు ఆమె పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో రైతులు ఆనందంలో మునితేలుతుంటే కంగనా వారిపై చేసిన కామెంట్స్‌ వివాదానికి దారి తీశాయి. 

చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్‌ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..

రైతులను ఉద్దేశిస్తూ ఆమె ‘దీన్ని ఖ‌లిస్థానీ ఉద్య‌మం’ అంటారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. దీంతో సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని  ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్‌’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్‌ షేర్ చేసింది.

చదవండి: షాకింగ్‌ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?

చేతిలో వైన్‌ గ్లాస్‌ పట్టుకుని గతంలోని ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘మ‌రొక రోజు మ‌రో ఎఫ్ఐఆర్‌. ఒక‌వేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..ఇంటి ద‌గ్గ‌ర నా మూడ్’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కాగా సున్నిత‌మైన రైతుల అంశంలో కంగ‌నా చేసిన కామెంట్ల‌పై క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్న వ్య‌క్తుల‌కు త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చింది కంగనా. మ‌రి దీనిపై ఎవ‌రూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కంగనా షేర్‌ చేసిన​ ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కంగనా తీరుపై ఎప్పటిలాగే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తీరుపై మండిపడుతున్నారు. 

చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement