మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు | Chodavaram TDP MLA Objectionable Comments On Women | Sakshi
Sakshi News home page

మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు

Published Wed, Aug 21 2024 8:59 AM | Last Updated on Wed, Aug 21 2024 9:30 AM

Chodavaram TDP MLA Objectionable Comments On Women

అనకాపల్లి, సాక్షి:  ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. 

చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.  చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. 

‘‘పథకాల వల్లే..  ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement