
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎంపై చేసిన వ్యాఖ్యల కేసును కొట్టేస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడారంటూ ఎంపీ అనిల్ సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు కేసును కొట్టేస్తూ కేటీఆర్‌కు ఊరట ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment