సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రమైన నేరంతో సమానమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం.. నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు పవన్ చేసిన దురుసు వ్యాఖ్యలపై భూమన స్పందించారు.
‘‘చెప్పుతో కొడతా.. గొంతు పిసికి చంపుతా’’ అని పవన్ అనడం హత్యానేరంతో సమానమని మండిపడ్డారు భూమన. చెగువేరా, చలం ఆదర్శమని చెప్పే పవన్.. ఇలాగేనా మాట్లాడేదని, అసలు పవన్ తన జనసేన క్యాడర్ ఏం సందేశం ఇస్తున్నాడని భూమన అసహనం వ్యక్తం చేశారు. పవన్ టీడీపీతో అంటకాగుతున్నాడని, తద్వారా సంస్కార హీనుడిగా మారిపోయాడని భూమన పేర్కొన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మూడు రాజధానులకు లభిస్తున్న ప్రజామద్దతును ఓర్వలేకనే కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. పవన్ ప్రసంగం.. అనంతరం చంద్రబాబుతో భేటీ పరిణామంపై స్పందిస్తూ.. పవన్ నగ్నత్వం ఏంటో నిన్నటి పరిణామం ద్వారా బయటపడిందన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య ద్రోహిగా పవన్ నిలిచిపోవడం ఖాయమని భూమన జోస్యం పలికారు భూమన.
Comments
Please login to add a commentAdd a comment