గ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని చెప్పుకొచ్చింది. రిజర్వేషన్ల పుణ్యమానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు తక్కువ మార్కులకే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంటు కొలువు దక్కాలంటే.. ఆ.....(బీప్) కులంలో పుట్టాలా..? అని ప్రశ్నించింది. మార్కులు సరిగా రాకున్నా.. రిజర్వేషన్ల ఫలితంగా.. ఆ.... (బీప్) కులస్తులు తమ తలపై (టాప్ పొజిషన్) కూర్చుకుంటున్నారని మండిపడింది.