reservation system
-
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
కులగణన వివరాలేవి?
సాక్షి, బళ్లారి: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు దక్కేందుకు వీలుగా నైష్పత్తిక రిజర్వేషన్ల పద్ధతి తేవాలన్నారు. 2011లో మోదీ సర్కారు చేపట్టిన కులగణన వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా బీసీలకు మెరుగైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాల్కీ, హుమ్నాబాద్ల్లో ఆయన ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీలపై మోదీ కేవలం మాటల్లోనే ప్రమ ఒలకబోస్తారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన వివరాలు బయట పెడతామని చెప్పారు. ప్రతి పనికి 40 కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారుకు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు కూడా రావు. ఉద్యోగ నియామకాల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలను, మోదీ, అదానీ బంధాన్ని గురించి లోక్‌సభలో ప్రశ్నిస్తే నా సభ్యత్వం తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనానికి నాంది అవుతుంది’’ అన్నారు. రాహుల్ కులగణన డిమాండ్‌కు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ్ట, ఆప్, బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందుకు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా తాజాగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తాజాగా ట్వీట్ చేశారు. -
తప్పు చేశాం.. క్షమించండి..!
న్యూఢిల్లీ : దళితులు, నిమ్న కులస్తులపై మంగళవారం అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ యువతి తీవ్ర విమర్శల నేపథ్యంలో క్షమాపణలు కోరారు. రిజర్వేషన్ల కారణంగా తక్కువ జాతివారు తమ తలపై వచ్చి కూర్చుంటున్నారని, దళితుల వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదంటూ ఆమె అసభ్యంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలను తిడుతూ తన మిత్రుడితో కలసి వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. తీవ్ర విమర్శలు రావడంతో వారిరువురు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఈమేరకు మరో వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో అలా మట్లాడానని యువతి చెప్పుకొచ్చారు. దయచేసి తనపై అసభ్యకర కామెంట్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఏ మతాన్ని, కులాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆ అసభ్యకర వీడియో బదులుగా.. తాజా వీడియోను షేర్ చేయండని కోరారు. (చదవండి : వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!) -
దళితులపై మండిపడిన యువతి
-
వైరల్ : దళితులపై బూతుపురాణం.. మోదీకి జేజేలు..!
న్యూఢిల్లీ : పీడిత ప్రజల బాగుకోసం స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సమాజంలో అంతరాలు పెంచాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 69 ఏళ్ల గణతంత్ర భారతంలో రిజర్వేషన్లు ఇంకా అవసరమా అని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదంటున్నారు. అయితే, నేటి ఆధునిక కాలంలోనూ మనదేశంలో కులం గోడలు బలంగా నిలబడడానికి రిజర్వేషన్లే కారణమంటూ ఓ యువతి బూతు పురాణం అందుకుంది. దళితులపై అసభ్యకర రీతిలో విరుచుకుపడింది. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కావడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని చెప్పుకొచ్చింది. రిజర్వేషన్ల పుణ్యమానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు తక్కువ మార్కులకే ఉద్యోగాలు తన్నుకు పోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంటు కొలువు దక్కాలంటే.. ఆ.....(అసభ్య పదజాలం) కులంలో పుట్టాలా..? అని ప్రశ్నించింది. మార్కులు సరిగా రాకున్నా.. రిజర్వేషన్ల ఫలితంగా.. ఆ.... (అసభ్య పదజాలం) కులస్తులు తమ తలపై (టాప్ పొజిషన్) కూర్చుకుంటున్నారని మండిపడింది. రాజకీయంగా తనకు ప్రధాని మోదీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. 40 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వీడియో చివర్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పైనా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దళితులపై మండిపడిన యువతి -
కోటా.. కొత్త కోణాలు
రిజర్వేషన్ కేటగిరీలోకి రాని కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ నిర్ణయం అమలు ఆచరణ సాధ్యం కాదని కొందరంటుంటే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులకు ఇది దారితీస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది మొదటి నుంచీ అన్ని విపక్షాలూ ఆరోపిస్తున్నదే. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం నిర్ణయం సమర్థనీయమా కాదా అన్నది చర్చనీయాంశమైంది. – న్యూఢిల్లీ ఓ కోణంలో సమర్థనీయమే.. సామాజికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారి(అగ్రవర్ణాలు)లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలూ కల్పించరాదని ఎవరూ అనరు. కాబట్టి ఆ కోణంలో చూస్తే కేంద్రం నిర్ణయం సమర్థనీయ మేనని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ అధ్యాపకుడు అభినవ్ ప్రకాశ్‌సింగ్ అన్నారు. కేంద్రం కోటా ప్రకటిస్తే సరిపోదని, దాని ఫలితాలు లభించాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వాటాపై వివిధ కులాల మధ్య జరిగే ఘర్షణను ఈ నిర్ణయం ఎంతవరకు పరిష్కరించ గలదన్నది కూడా ఆలోచించా లన్నారు. అగ్రవర్ణంలో పుట్టినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన వ్యక్తి అన్ని విషయాల్లో ఇతర బలహీన వర్గాల వ్యక్తుల్లాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల్లోని పేదలు అగ్రవర్ణ పేదలతో పోలిస్తే మరింత ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం వారు సామాజికంగా, సాంస్కృతికంగా కూడా వెనకబడి ఉండటం, వివక్షకు గురికావడం. కాబట్టి ఈ కోణంలో చూస్తే అగ్రవర్ణ పేదలను, ఓబీసీ పేదలను ఒకే గాటన కట్టడం ఎంత వరకు సమర్థనీయమని రాజ్యాంగ నిపుణులు వేస్తున్న ప్రశ్న. అన్నింటికీ క్రీమీలేయర్ వర్తింప చేయాలి.. తాజా కోటాకు సంబంధించిన కుటుంబ ఆదాయం, సాగుభూమి ఆధారంగా ఆర్థిక వెనక బాటును నిర్ణయించనున్నట్టు పేదల బిల్లు ప్రతి పాదించింది. అయితే, ఈ ప్రాతిపదిక అగ్ర వర్ణాలకేనా లేక అన్ని వర్ణాలకీ వర్తిస్తుందా అన్నది బిల్లులో స్పష్టం చేయలేదు. కుల, మతాలకతీ తంగా ఆర్థికంగా వెనుక బడినవారికి రిజ ర్వేషన్ కల్పిస్తు న్నట్టు మాత్రమే పేర్కొంది. దీనివల్ల అగ్రవర్ణ పేదలు కూడా దీని పరిధిలోకి వస్తారు. అదే జరిగితే రిజర్వేషన్లు మూడు రకాలుగా తయారవుతాయి. కేవలం గుర్తింపు ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీలు ఒక రకం. కులం, ఆర్థిక స్తోమత ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు రెండో రకం. ఓబీసీ/ఈబీసీలు ఈ కోవలోకి వస్తారు. మూడోది కులంతో సంబంధం లేకుండా కేవలం ఆర్థిక ప్రాతిపదికపైనే ఇచ్చే రిజర్వేషన్లు. ఈ మూడు రకాల రిజర్వేషన్లకు సంబంధించి వివా దాలు తలెత్తే అవకాశం ఉంది. ఓబీసీ రిజర్వేషన్లలో కుల ప్రాతిపదికన తొలగించాలని, ఆర్థిక స్తోమతనే ప్రాతిపదికగా తీసుకోవాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ దీనిని అమలు చేస్తే, ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ ఒకే కోటా ఉంటుంది. ప్రస్తుత ఓబీసీ, ప్రతిపాదిత ఈబీసీ కోటాను కలిపేసి ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ క్రీమీలేయర్ వర్తింపజేసి, పేదలకు ఈ కొత్త కోటాలోనే రిజర్వేషన్ కల్పించాలనేది వారి డిమాండ్. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టి, అసలైన పేదలకే రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రస్తుతానికయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల కోపాన్ని కొంతమేర తగ్గించవచ్చు. రిజర్వేషన్లపై వారి అభిప్రాయాన్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంపై వారిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం, ఇది మెరిట్‌ను చంపేస్తుందంటూ రోడ్డెక్కకపోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమ వాటాపై వివిధ కులాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను ఈ పేదల కోటా ఏ మేరకు పరిష్కరి స్తుందన్నది వారి అనుమానం. దశాబ్దాల తరబడి ఖాళీగా ఉంటున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ ఘర్షణను నివారించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి పోతుండటం, నియామక ప్రక్రియ నిలిచిపోవ డం వల్ల యువజనుల్లో తలెత్తిన అసంతృప్తిని ఉద్యోగాల భర్తీ ద్వారా తొలగించడమన్నది ఈ ఎన్నికల సంవత్స రంలో ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం కావాలని ప్రొఫెసర్ అభినవ్ ప్రకాశ్‌సింగ్ సూచిస్తున్నారు. -
ఓబీసీ క్రీమీలేయర్ రూ.8 లక్షలు
♦ ఓబీసీ వర్గీకరణకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు ♦ కేంద్ర కేబినెట్ నిర్ణయం ♦ ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను ముట్టుకోం ♦ ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనల్లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఓబీసీల వార్షిక ఆదాయ పరిమితి (క్రీమీలేయర్)ని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా.. రిజర్వేషన్ లాభా లను అందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఓబీసీల క్రీమీలేయర్‌ను ఏడాదికి రూ. 6లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలూ లేవని స్పష్టం చేశారు. క్రీమీలేయర్‌పై.. ఇటీవల అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఓబీసీల క్రీమీలేయర్ పెంపుపై సంకేతాలిచ్చారు. ఓబీసీల వర్గీకరణ జరగాల్సిన అవసరాన్నీ పునరుద్ఘాటించారు. 1993లో ఓబీసీల క్రీమిలేయర్ రూ.లక్షగా నిర్ణయించగా.. 2004లో దీన్ని రూ.2.5 లక్షలకు పెంచారు. అనంతరం 2008లో రూ.4.5 లక్షలకు పెంచగా.. 2014లో రూ.6 లక్షల పరిధిని నిర్ణయించారు. ప్రస్తుతం దీన్ని మరో రెండు లక్షలు పెంచి 8లక్షలకు తెచ్చినట్లు జైట్లీ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలందించేందుకే.. రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందజేసేందుకు ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించిందని జైట్లీ వెల్లడించారు. కమిషన్‌కు చైర్మన్ నియామకం జరిగిన తర్వాత 12 వారాల్లో నివేదిక అందుతుందన్నారు. ‘ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందుతున్నాయో లేదో పరిశీలిస్తుంది. ఓబీసీల్లో వర్గీకరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఈ కమిషన్ ఖరారు చేస్తుంది’ అని జైట్లీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ చేపట్టారన్నారు. కాగా, ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందంటూ వస్తున్న వార్తలను జైట్లీ ఖండించారు. 2015లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలపై జైట్లీ పైవిధంగా స్పందించారు. అయితే రిజర్వేషన్‌పై సమీక్షించాలనే ప్రతిపాదనేదీ లేదని.. భవిష్యత్తులో ఉండదని కూడా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనకూ కేబినెట్ మౌఖికంగా ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీజేపీ నేతల హర్షం ఓబీసీల క్రీమీలేయర్ పెంపు, వర్గీకరణ అంశాలపై నిర్ణయం తీసుకోవటం పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అద్వితీయం, చారిత్రకమని ప్రశంసించారు. కొన్నేళ్లుగా ఓబీసీలు చేస్తున్న రెండు కీలకమైన డిమాండ్లను కేంద్రం అంగీకరించినట్లయిందన్నారు. ‘వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఇదో అద్వితీయమైన నిర్ణయం. దీంతో చాలామందికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపీందర్ యాదవ్, కేంద్ర మంత్రి సంతోశ్ గంగ్వార్ పేర్కొన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పథకానికి ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’గా పేరు మార్చేందుకు అంగీకారం. రూ.6వేల కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు మేలు కలగటం, 5.30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం. నేపాల్ సరిహద్దులో మేచీ నదిపై రూ. 159కోట్లతో వంతెన నిర్మాణానికి ఆమోదం. -
ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే, ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం ఇస్తున్న 50% రిజర్వేషన్లు పోను.. మిగతా 50%లో ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశాల్లో కీలకమైన అంశమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్ల విషయంలో చర్చ లేదు. అది కాకుండా ఇంకా నిర్ణయాత్మక చర్యలు ఏం తీసుకోగలమనేది ముఖ్యమైన విషయం’ అన్నారు. ‘ఆర్థిక వెనకబాటుదనం ప్రాతిపదికగా ఉన్నత కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటోందా?’ అన్న ప్రశ్నకు.. ఆయన సూటిగా జవాబివ్వలేదు. -
రేపు ఏడుగంటలు రైల్వే రిజర్వేషన్‌కు అంతరాయం
ఆన్లైన్ రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సదుపాయానికి ఆదివారం ఏడు గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దక్షిణ రైల్వే కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్) పనిచేయదు. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల చెన్నైలోని పీఆర్ఎస్ సర్వర్‌ను షట్ డౌన్ చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. దీనివల్ల దక్షిణ, దక్షిణ మధ్య, నైరుతి రైల్వే పరిధిలోని రిజర్వేషన్ల వ్యవస్థి పనియచేయదని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అడ్వాన్స్ టిక్కెట్ల రిజర్వేషన్లు, టిక్కెట్ల రద్దు, ఈ టిక్కెటింగ్, రిజర్వేషన్ చార్టింగ్, ఎంక్వైరీ సేవలు పనిచేయవు.