రేపు ఏడుగంటలు రైల్వే రిజర్వేషన్కు అంతరాయం | PRS Server at Chennai will be shut down on Sunday | Sakshi
Sakshi News home page

రేపు ఏడుగంటలు రైల్వే రిజర్వేషన్కు అంతరాయం

Published Sat, Nov 16 2013 2:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

PRS Server at Chennai will be shut down on Sunday

ఆన్లైన్ రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సదుపాయానికి ఆదివారం ఏడు గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దక్షిణ రైల్వే కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్) పనిచేయదు. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల చెన్నైలోని పీఆర్ఎస్ సర్వర్ను షట్ డౌన్ చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు.

దీనివల్ల దక్షిణ, దక్షిణ మధ్య, నైరుతి రైల్వే పరిధిలోని రిజర్వేషన్ల వ్యవస్థి పనియచేయదని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అడ్వాన్స్ టిక్కెట్ల రిజర్వేషన్లు, టిక్కెట్ల రద్దు, ఈ టిక్కెటింగ్, రిజర్వేషన్ చార్టింగ్, ఎంక్వైరీ సేవలు పనిచేయవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement