ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు! | Upper-caste In the The reservation for the poor! | Sakshi
Sakshi News home page

ఉన్నత కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు!

Published Thu, Sep 24 2015 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

ప్రకాశ్‌ జవదేకర్

న్యూఢిల్లీ: ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే, ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం ఇస్తున్న 50% రిజర్వేషన్లు పోను.. మిగతా 50%లో ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశాల్లో కీలకమైన అంశమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

‘ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్ల విషయంలో చర్చ లేదు. అది కాకుండా ఇంకా నిర్ణయాత్మక చర్యలు ఏం తీసుకోగలమనేది ముఖ్యమైన విషయం’ అన్నారు. ‘ఆర్థిక వెనకబాటుదనం ప్రాతిపదికగా ఉన్నత కులాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటోందా?’ అన్న ప్రశ్నకు.. ఆయన సూటిగా జవాబివ్వలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement