సాక్షి, న్యూఢిల్లీ: ‘రాహుల్ కౌగిలింత’ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. తనని చూస్తే ఎక్కడ కౌగిలించుకుంటానో అని భయంతో బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత దుబే.. రాహుల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
(‘లోఫర్లే అలా చేస్తారు’), (అదో రకం షాక్)
‘మేం ఆయన్ని ఎందుకు కౌలిగించుకోవాలి?. పైగా స్వలింగసంపర్కానికి సంబంధించి సెక్షన్ 377ను ఇంకా రద్దు కాలేదు కదా. ఈ సమయంలో రాహుల్‌ను కౌగిలించుకుంటే మా భార్యలు మాకు ఖచ్ఛితంగా విడాకులు ఇస్తారు. అయితే రాహుల్‌కి ఓ సలహా. ఆయన గనుక ముందు వివాహం చేసుకుంటే మంచిది. అప్పుడు నిరభ్యరంతంగా కౌగిలించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అయితే దుబే చేసిన ‘తేడా వ్యాఖ్యల’పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గొడ్డా(జార్ఖండ్)లోని నిశికాంత్ ఇంటి బయట ధర్నాకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment