Reciprocal Tariff
-
ట్రంప్ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లోనూ అనిశ్చితి ఆవహించింది. ఈ క్రమంలో స్వీడన్‌కు చెందిన భారీ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కులకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అమెరికాలోని మూడు కర్మాగారాలలో 550 నుంచి 800 మంది కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఈ తొలగింపులు పెన్సిల్వేనియాలోని మకుంగీలో ఉన్న మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియాలోని డబ్లిన్, మేరీల్యాండ్‌లోని హేగర్స్టౌన్లో ఉన్న రెండు వోల్వో సైట్లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఆటోమోటివ్, భారీ పరికరాల రంగాలను అస్తవ్యస్తం చేసి, తయారీ ఖర్చులను పెంచడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇది చదివారా? ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూతసుంకాలే కారణం..ఉత్తర అమెరికాలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్న వోల్వో సంస్థ భారీ-డ్యూటీ ట్రక్కులకు మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వివరించింది. సరుకు రవాణా రేట్లలో అస్థిరత, సంభావ్య నియంత్రణ మార్పులు, సుంకాల వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రభావం వంటి అనేక కారణాలు ఈ తొలగింపులకు దోహదపడ్డాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిర్ధారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము” ఆ ప్రతినిధి తెలిపారు.ఇటీవలి నెలల్లో అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడీ సుంకాలు.. ముడి పదార్థాలు, విడి భాగాల ఖర్చులను మరింత పెంచాయి. ఫ్రైట్ డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి వోల్వో వంటి స్థిరమైన వాణిజ్య పరిస్థితులపై ఆధారపడే సంస్థలను మరింత ఒత్తిడికి గురిచేశాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలగింపునకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ప్రభావితమైన కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర సాయాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. -
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025 -
అమెరికా టారిఫ్‌లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్‌లు షాక్‌కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్‌ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్‌ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
త్వరలో ఆర్థిక మాంద్యం!
అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు. -
‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’
అమెరికా టారిఫ్‌లు వాహన ధరలను పెంచుతాయని నిస్సాన్ అమెరికా ఛైర్మన్ క్రిస్టియన్ మ్యూనియర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కారు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. మెక్సికో నుంచి ఎగుమతయ్యే వాహనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను కుదిపేస్తాయని చెప్పారు.‘20,000 డాలర్ల(రూ.16 లక్షలు) సగటు ధర కలిగిన నిస్సాన్ వెర్సా మెక్సికోలో తయారవుతుంది. టారిఫ్ అమల్లోకి రావడంతో అమెరికాకు దీని ఎగుమతులు కష్టంగా మారుతున్నాయి. యూఎస్‌లో చౌకగా లభించే కారు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోకు బదులుగా అమెరికాలోనూ నిస్సాన్ చౌక వాహనాలను తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, మెక్సికో నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే సవాళ్లు ఎదురవుతాయి’ అని మ్యూనియర్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?కాక్స్ ఆటోమోటివ్ విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌లో కారు సగటు ధర 48,000 డాలర్లు(సుమారు రూ.40 లక్షలు). ప్రభావిత మోడళ్ల ధరలకు టారిఫ్‌లు 10% నుండి 15% వరకు అదనంగా పెరుగుతాయి. లెవీ పరిధిలో లేని వాహనాల ధరలు మొత్తంగా 5% పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. టారిఫ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మోడళ్లలో 30,000 డాలర్ల(రూ.25 లక్షలు) కంటే తక్కువ ధర కలిగినవే ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం. -
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్–మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్ గ్రూప్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. -
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి. -
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందానికి చాన్స్
యూఎస్ టారిఫ్‌లతో తలెత్తే సంక్షోభాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు వేగంగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత్‌సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన నేపథ్యంలో పురి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది.చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌లను ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. చైనాపై 145 శాతం సుంకాలు ప్రకటించినప్పటికీ కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్ తదితర కొన్ని ఎల్రక్టానిక్ ప్రొడక్టులను మినహాయించారు. ప్రతీకార టారిఫ్‌ల అమలు జులై 9 వరకూ వాయిదా పడినప్పటికీ యూఎస్ ఎగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమపై టారిఫ్‌ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టమని పురి పేర్కొన్నారు. అయితే భారత్ వీటిని పటిష్టస్థాయిలో ఎదుర్కోగలదని అంచనా వేశారు. పలు దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు) కుదుర్చుకునేందుకు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాదిలోనే ఈయూ, యూకేతోపాటు యూఎస్‌తోనూ ఒప్పందాలపై సంతకాలకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.మార్చిలోనే చర్చలు మొదలుయూఎస్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి(బీటీఏ) మార్చిలోనే చర్చలు మొదలయ్యాయి. ఒప్పందం తొలి దశను సెప్టెంబర్–అక్టోబర్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030కల్లా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించే లక్ష్యంతో ఇందుకు శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయంగా చూస్తే ఎఫ్‌టీఏ, సమీకృత ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), బీటీఏలుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. తద్వారా భాగస్వామ్య దేశాలు గరిష్ట సంఖ్యలో వస్తుసంబంధ వాణిజ్యంపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం చేస్తాయి.ఇదీ చదవండి: ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్స్వల్ప కాలానికి అనిశ్చితులువినియోగ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలానికి అనిశ్చితులను ఎదుర్కోవలసి ఉంటుందని పురి తెలియజేశారు. అయితే పోటీతత్వం, డిజిటైజేషన్, ఫ్యూచర్ రెడీ పోర్ట్‌ఫోలియో తదితరాల ద్వారా భారత్ నిలదొక్కుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్వల్పకాల అనిశ్చితి, అంచనాలకు అందని పరిస్థితులు ప్రపంచ వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చునని, దీంతో భారత్‌పై కొంతమేర ప్రతికూల ప్రభావానికి చాన్స్ ఉందని విశ్లేషించారు. -
2000 కంటైనర్లలో రొయ్యలు.. ఎక్కడకు వెళ్తున్నాయంటే..
అమెరికాకు రొయ్యలు సరఫరా చేసేందుకు భారత సీఫుడ్ ఎగుమతిదారులు సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు బ్రేక్ పడడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేస్తున్నట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించినట్లయింది. దాంతో సుమారు రెండు వేల కంటైనర్ల రొయ్యలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను కొంతకాలంపాటు నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న 10 శాతాన్ని అమలు చేస్తుండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భారత సీఫుడ్ ఎగుమతిదారులు 35,000-40,000 టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశ్రమ అధికారులు సోమవారం తెలిపారు. సుంకాల భయాలతో నిలిపివేసిన ఎగుమతులను ప్రాసెస్ చేస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. సుమారు 2,000 కంటైనర్ల రొయ్యలు ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: సుంకాల యుద్ధంలో విజేతలుండరుఅమెరికా దాటికి 145 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న చైనా మినహా అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. దాంతో భారత్‌పై 10 శాతం సుంకాలు అమలవుతుండడంతో ప్రస్తుతం ఎగమతులు ఊపందుకున్నాయి. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.7 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 1.8 శాతంగా ఉంది. పరిమాణం, విలువ రెండింటిలోనూ యూఎస్‌కు భారతదేశం అతిపెద్ద రొయ్యల మార్కెట్‌గా ఉంది. సుంకాల భయాలున్నా ఆర్డర్లు తగ్గలేదని అసోసియేషన్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసింది. -
విజేతలుండని యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది.సూపర్ పవర్‌గా చైనాఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్ఈఏఎస్-యూసోఫ్ ఇషాక్ ఇన్స్టిట్యూట్ విజిటింగ్ ఫెలో గుయెన్ ఖాక్ గియాంగ్ అన్నారు.వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి..ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్ ఉండనున్నారు.ఇదీ చదవండి: మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..ఎలా తప్పించుకోవాలి..జిన్‌పింగ్ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి. -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వరుస ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో ఆ దేశ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సుంకాలు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో, అక్కడి ఎగుమతిదారులు అనుసరిస్తున్న వ్యూహాలేమిటో తెలుసుకుందాం.145 శాతం వరకు సుంకాలుచైనా ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఎగుమతులపై ఆధారపడి ఉంది. చైనా అతిపెద్ద మార్కెట్ల్లో యూఎస్ కీలకం. 2024లో యూఎస్‌కు చైనా సుమారు 440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో 14%, జీడీపీలో సుమారు 3%గా ఉంది. చైనా దిగుమతులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవల వివిధ వస్తువులపై 10 శాతం నుంచి 145 శాతానికి అమెరికా సుంకాలు పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మెషినరీ సహా పలు రకాల ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకుంది.ఎగుమతులపై తీవ్ర ప్రభావంసుంకాల తక్షణ ప్రభావం కింద చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్ గణనీయంగా తగ్గింది. టారిఫ్‌ల పెంపు వల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, చైనా నుంచి యూఎస్ దిగుమతుల్లో 9% ఉన్న స్మార్ట్ఫోన్లు వంటి ఉత్పత్తులు తీవ్రమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి. దాంతో వాటిని మార్కెట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. దాంతోపాటు మిలియన్ల మంది చైనా కార్మికుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో సుమారు రెండు కోట్ల ఉద్యోగాలు యూఎస్ సంబంధిత ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి.ఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.తగ్గిన జీడీపీ అంచనాఅమెరికా సుంకాలు పెంపు, అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వంటి కారణాలతో గోల్డ్ మన్ శాక్స్ 2025లో చైనా జీడీపీ వృద్ధి అంచనాను 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటా తక్కువే అయినప్పటికీ, తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎందురవుతుంది.చైనా ప్రతిస్పందనచైనా యూఎస్ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి చైనా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతిదారులు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. 2019 నుంచి ఆగ్నేయాసియా చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాలతో ఈ వాణిజ్య పరిమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, టెక్స్టైల్ సంస్థలు తక్కువ వాణిజ్య అవరోధాలు ఉన్న మార్కెట్లకు తమ ఎగుమతులను మళ్లిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లను అందిస్తాయి.ఇదీ చదవండి: థియేటర్ల పంట పండుతుందిలా..యూఎస్‌పై చైనా రివర్స్ సుంకాలుఅమెరికా వస్తువులపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది సోయాబీన్స్, పంది మాంసం వంటి వాటితోపాటు ఇంధనాలు, యంత్రాలు లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఈమేరకు చైనా ప్రతీకార సుంకాలను విధించింది. -
డాలర్‌కు ట్రంప్ గండం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు యూఎస్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇది అమెరికా వాణిజ్య విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. దేశీయ పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ ఈ సుంకాల అనాలోచిత నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇందులో యూఎస్ డాలర్ క్షీణించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ క్షీణతకు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వాణిజ్య అసమతుల్యతసుంకాలు దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చును పెంచుతాయి. ఇతర దేశాలు కూడా ఇందుకు అనుగుణంగా తమ సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడానికి దారితీస్తుంది. చైనా, కెనడా వంటి వాణిజ్య భాగస్వాములు ప్రతిచర్యలకు పూనుకోవడంతో అమెరికా ఎగుమతులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాణిజ్య అసమతుల్యతలు ప్రపంచ మార్కెట్లలో డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి.దెబ్బతింటున్న ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసంఫైనాన్షియల్ మార్కెట్లు ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అంచనాలపై వృద్ధి చెందుతాయి. సుంకాలను ప్రవేశపెట్టడం అనిశ్చితిని సృష్టించింది. ఇది అమెరికా విదేశీ పెట్టుబడులకు ఆకర్షించడంలో వెనుకపడేలా చేసింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్కెట్లను కోరుకోవడంతో డాలర్‌కు డిమాండ్ తగ్గింది.గ్లోబల్ కరెన్సీ సర్దుబాట్లుయూఎస్ సుంకాల ప్రభావానికి గురైన దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో తమ వస్తువులకు పోటీని కొనసాగించడానికి తరచుగా వారి కరెన్సీ విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనా యువాన్‌ను స్థిరీకరించడానికి చర్యలు తీసుకుంది. గ్లోబల్ కరెన్సీ విధానాల్లో ఇలాంటి సర్దుబాట్లు పరోక్షంగా అమెరికా డాలర్ విలువను ప్రభావితం చేశాయి.ఇదీ చదవండి: టారిఫ్ పాజ్.. మార్కెట్ జోష్ఆర్థిక వృద్ధి ఆందోళనలుసుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేస్తాయి. అవి దేశీయ పరిశ్రమలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అవి స్థానిక వ్యాపారాలు, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయి. దాంతో ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థ పట్ల భవిష్యత్తు అంచనాలను తగ్గిస్తుంది. -
టారిఫ్ పాజ్.. మార్కెట్ జోష్
ముంబై: భారత్‌తో సహా 75 దేశాలపై ట్రంప్ సుంకాలను మూడు నెలలు వాయిదా వేయడంతో దేశీయ స్టాక్ సూచీలు రెండు శాతం మేర ర్యాలీ చేశాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు పరిమితం చేస్తూ క్రూడాయిల్ ధరలు దిగిరావడం, అమెరికా కరెన్సీ డాలర్ క్షీణత అంశాలు ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,310 పాయింట్లు పెరిగి 75వేల స్థాయిపైన 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 429 పాయింట్లు బలపడి 22,829 వద్ద నిలిచింది. సూచీల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ.7.85 లక్షల కోట్లు పెరిగి రూ.401.67 లక్షల కోట్లు(4.66 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.రోజంతా లాభాలుసెన్సెక్స్ 988 పాయింట్ల లాభంతో 74,835 వద్ద, నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 22,695 వద్ద మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా భారీ లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,620 పాయింట్లు ఎగసి 75,467 వద్ద, నిఫ్టీ 525 పాయింట్లు బలపడి 22,924 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి.రంగాల వారీగా ఇండెక్సులుడాలర్ బలహీనతతో ఎగుమతులపై లాభాలు ఆర్జించే మెటల్, ఫార్మా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 4.29%, కమోడిటీస్ 3.50%, కన్జూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్ సూచీలు 3% ర్యాలీ చేశాయి. విద్యుత్, ఇంధన, ఇండ్రస్టియల్స్, కన్జూమర్ డి్రస్కేషనరీ, హెల్త్‌కేర్ సూచీలు రెండుశాతం పెరిగాయి. వొలటాలిటి ఇండెక్స్(వీఐఎక్స్) 6% క్షీణించి 20.11 స్థాయికి దిగివచి్చంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ రెండు శాతం లాభపడ్డాయి. రెండు షేర్లకే నష్టాలుసెన్సెక్స్లో 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్ (0.64%), టీసీఎస్(0.43%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు 5% వరకు ర్యాలీ చేశాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ 2.33%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3%, ఐసీఐసీఐ బ్యాంకు 1%, ఎయిర్టెల్ 2.50%, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ 3% రాణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 807 పాయింట్లు కావడం విశేషం.నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు డీలాపడింది. బీఎస్ఈలో అరశాతం పతనమై రూ.3232 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1% పైగా నష్టపోయి రూ.3205 వద్ద కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..రూపాయి వరుస నష్టాలకు చెక్అమెరికా డాలర్ అనూహ్య క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ బలమైన ర్యాలీతో డాలర్ మారకంలో రూపాయి విలువ 58 పైసలు బలపడి 86.10 వద్ద స్థిరపడింది. దీంతో దేశీయ కరెన్సీ నాలుగు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 86 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో ట్రేడై ఇంట్రాడే గరిష్టం వద్ద స్థిరపడింది. ‘‘ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 4 ఏళ్లలో తొలిసారి 100 స్థాయికి దిగిరావడంతో పాటు క్రూడాయిల్ ధర తగ్గడం కూడా కలిసొచ్చాయి. వచ్చే వారంలో దేశీయ కరెన్సీ 85.75–86.25 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని ఫిన్రెక్స్ ట్రైజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు. -
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లుభారత్లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ యాపిల్ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్‌లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు. -
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ఫార్మాస్యూటికల్స్‌పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్ సంకేతాలిచ్చారు.పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావంరాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి. -
సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు. -
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్ -
ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు?
ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు. -
ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు. -
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్‌పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.టారిఫ్‌ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారత్‌పైనా ప్రభావం..విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గుఐఫోన్ రూ.రెండు లక్షలు!చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు. -
ఐటీ రంగానికి సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్‌లతో తలెత్తిన వాణిజ్య భయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ సాఫ్ట్వేర్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యూరోపియన్ దేశాలపైనా టారిఫ్‌ల అంశం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు వివరించారు. వెరసి ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లుగా నిలుస్తున్న యూఎస్, యూరప్‌లలో ప్రతీకార టారిఫ్‌లు మందగమనం లేదా ఆర్థిక మాంద్యానికి దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్త ఆందోళనలకు కారణమవుతున్నట్లు ఐటీ నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు నిరాశపరచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఏడాది(2025–26) ఆదాయ అంచనాలు(గైడెన్స్) నీరసించవచ్చని భావిస్తున్నారు.ఫలితాలకు రెడీఇకపై సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు 2024–25 క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాలపై అంచనాలు(గైడెన్స్) ప్రకటించనున్నాయి. తొలుత టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో విప్రో 15న, ఇన్ఫోసిస్ 17న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 22న, టెక్ మహీంద్రా 24న పనితీరు వెల్లడించనున్నాయి.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువ్యయాలు తగ్గవచ్చుఐటీ సేవలకు అతిపెద్ద విభాగం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు.. కీలకమైన రిటైల్, తయారీ రంగాలలో కంపెనీల వ్యయాలు తగ్గనున్నట్లు భావిస్తున్నారు. విచక్షణాధారిత వ్యయాలపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో రికవరీకి చాన్స్ తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. రానున్న రెండు త్రైమాసికాలలో ఐటీ కంపెనీల ఫలితాలు నిరాశరపచడానికితోడు ఆదాయ అంచనాలలో కోతలకు వీలున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత టారిఫ్ వార్ కారణంగా రిటైల్, తయారీ రంగాలు డీలా పడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సర్వైవల్ వ్యయాలు తప్పకపోవచ్చని, జెన్ఏఐకు సైతం పెట్టుబడుల కేటాయింపులు పెరగవచ్చని మరికొంతమంది నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది(2025–26) ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో ఆర్థిక స్థిరత్వం, ఏఐ సేవలకు డిమాండ్ వంటి అంశాలు తిరిగి ఐటీ సేవలకు సానుకూలతను తీసుకువచ్చే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ వార్ సెగ అన్ని దేశాలకూ గట్టిగానే తగులుతోంది. అయితే భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాం తదితర పోటీ దేశాలపై అధిక సుంకాలు విధించడం మన టాయ్ పరిశ్రమ దీన్ని సదావకాశంగా మలుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇతర దేశాల సంస్థలతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశీ కంపెనీలు ఇప్పటికే పని మొదలు పెట్టాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇతర దేశాలపై అధిక టారిఫ్‌ల ప్రభావంతో మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుందని, దీంతో ఈ వాణిజ్య యుద్ధంలో భారత్ విజయం సాధించనుందని కూడా వారు అంటున్నారు.ఆసియాలో చైనాపై 54 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం, ఇండోనేషియాపై 32 శాతం చొప్పున ట్రంప్ భారీగా సుంకాలను వడ్డించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మాత్రం 26 శాతం టారిఫ్‌లతో సరిపెట్టారు. ‘ఇది మనకు భారీగా అవకాశాలను అందించనుంది. ఎందుకంటే వియత్నాం 6 బిలియన్ డాలర్లు, చైనా 80 బిలియన్ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. భారతీయ టాయ్స్‌తో పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్ సంస్థలన్నీ భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాయి’ అని ప్లేగ్రో టాయ్స్ ఇండియా సీఈఓ మను గుప్తా పేర్కొన్నారు.34.8 కోట్ల డాలర్ల ఎగుమతులు..పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లుగా భారత్ నుంచి 32.6–34.8 కోట్ల డాలర్ల విలువైన టాయ్ ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికాతో వీలైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ టాయ్ సంస్థలు యూఎస్‌కు తమ ఎగుమతులను పెంచేందుకు దోహదం చేస్తుందని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఇప్పుడు రంగాల వారీగా పాలసీలను రూపొందిస్తున్నాయన్నారు. కాగా, బడ్డెట్లో టాయ్ పరిశ్రమ కోసం ప్రకటించిన జాతీయ యాక్షన్ ప్లాన్ ఈ రంగానికి మరింత దన్నుగా నిలవనుందని సన్లార్డ్ గ్రూప్ ప్రమోటర్ అమితాభ్ ఖర్బందా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అప్పుల కుప్పలుగా రాష్ట్రాలుఇతర దేశాల ఆధిపత్యంతో భారత్ అనేక ఏళ్లుగా నికర టాయ్స్ దిగుమతిదారుగానే కొనసాగుతోంది. గడిచిన దశాబ్దకాలానికి పైగా చైనా పైనే పూర్తిగా ఆధారపడుతూ 76 శాతం మేర టాయ్స్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. 2012–13లో భారత్ చైనా నుంచి 21.4 కోట్ల డాలర్ల టాయ్స్ దిగుమతి చేసుకోగా, 2023–24లో ఇది 4.16 కోట్ల డాలర్లకు దిగొచి్చంది. అంటే దాదాపు 94 శాతం దిగుమతలు కాస్తా, 64 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ టాయ్ మార్కెట్లో భారత్ పోటీతత్వానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి. -
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన. -
టారిఫ్ టెర్రర్... ఇన్వెస్టర్లకు ఫీవర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ను పదే పదే టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్ లిబరేషన్ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్ ఫైనాన్స్ ఫౌండర్, సీఈఓ విరమ్ షా పేర్కొన్నారు. మార్కెట్లో మరింత కరెక్షన్ తప్పదు... టారిఫ్ వార్ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్ వార్తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్ ఎంఎఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ‘ట్రంప్ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్ రంగాల (ఆటో, మెటల్స్) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ సూచించారు. మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్‌లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్ అయ్యింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.డెట్ ఫండ్స్‌కు దన్ను... జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. ‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్ (వడ్డీ) రేటు బాండ్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ విలువ (ఎన్ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన. -
క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్‌లు
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలకు ప్రతికూలంగా మారితే, ఇంకొన్ని విభాగాలకు అవకాశంగా పరిణమించింది. భారత్‌లోని జీడిపప్పు వ్యాపారులకు ఈ సుంకాలు అమెరికాలో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు మార్గాన్ని చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌కు పెద్దమొత్తంలో జీడీపప్పు ఎగుమతి చేస్తున్న వియత్నాంపై 46 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 26 శాతం సుంకానికి లోబడి భారతీయ జీడిపప్పు అక్కడి మార్కెట్లో పోటీపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.చాలా ఏళ్లుగా వియత్నాం యూఎస్ జీడిపప్పు మార్కెట్లో ఆధిపత్యం సాగిస్తోంది. అమెరికా దిగుమతుల్లో సుమారు 90 శాతం వాటా వియాత్నాందే కావడం విశేషం. భారత్ వాటా ఈ విభాగంలో చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000-8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కొత్త టారిఫ్ విధానాలు అమెరికాలో భారతీయ జీడిపప్పు మార్కెట్‌ను విస్తరించుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. వియత్నాం కంటే భారత్‌పై విధించిన సుంకాలు 20 శాతం తక్కువగా ఉండడం ఇందుకు కారణం. దాంతో యూఎస్ మార్కెట్లో ఇండియా క్యాష్యూ చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది అక్కడి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలుప్రాసెసింగ్ సామర్థ్యాలు పెంచుకోవాలి..ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ఇండియాపై తక్కువ టారిఫ్ ఉండడం ఇందుకు కారణం. అమెరికా జీడిపప్పు మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు ఇండియాతో పాటు తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలు కూడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి’ అని చెప్పారు. -
సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు
అమెరికా విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని విభిన్న సెక్టార్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే భారతీయ తోలు(లెదర్) పరిశ్రమ యూఎస్‌కు తన ఎగుమతులను విస్తరించడానికి ఈ సుంకాలు ఎంతో అవకాశాన్ని కల్పించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ 870 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇండియన్ లెదర్ వస్తువులకు అమెరికాలో ఉన్న మార్కెట్‌ను ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.ఈ విభాగంలో భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ఈ అవకాశాన్ని ప్రేరేపించే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. భారత్‌పైనా యూఎస్ సుంకాలు ఉన్నప్పటికీ ఇక్కడి ఎగుమతులపై విధించిన సుంకాల కంటే కనీసం 20% అధిక సుంకాలను ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, యూఎస్ మార్కెట్లో వారి పట్టును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) మాజీ వైస్ ప్రెసిడెంట్, ఫరీదా గ్రూపు ఉన్నతాధికారి ఇస్రార్ అహ్మద్ మాట్టాడుతూ.. ‘తోలు పరిశ్రమ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించాలి. తమ మార్కెట్ పరిధిని వైవిధ్యపరచుకోవడంపై ఆసక్తిగా ఉండాలి’ అన్నారు.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?పరిమిత సమయమే..?పోటీ దేశాలు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన నిమ్మకుండిపోకుండా ఆ దేశంతో చర్చలు జరిపి తమ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో వృద్ధిని కొనసాగించడానికి ఈ టారిఫ్ ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలలకు మించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. భారతీయ తోలు పరిశ్రమ దాని బలమైన సరఫరా గొలుసును ఆసరాగా చేసుకుని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని చెబుతున్నారు. -
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో అమెరికా మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. 2020 తర్వాత భారీ పతనాన్ని చవిచూశాయి. ఎస్&పీ 500 సూచీ ఏకంగా 6 శాతం పడిపోయింది. ఇది మాంద్యం భయాలకు ఆజ్యం పోసింది. ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆందోళనను తీవ్రతరం చేసింది.కోవిడ్-19 సంక్షోభం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటి పరిస్థితి తర్వాత వాల్ స్ట్రీట్ శుక్రవారం తీవ్ర తిరోగమనాన్ని ఎదుర్కొంది. ట్రంప్ టారిఫ్ పెంపునకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతులపై ప్రతీకార సుంకాలను ప్రకటించిడంతో ఎస్&పీ 500 సూచీ 6% పడిపోయింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన 2020 మార్చి తర్వాత ఎస్&పీ 500 సూచీ పనితీరుకు సంబంధించి అత్యంత చెత్త వారం ఇదే. ఇక డౌజోన్స్ 2,231 పాయింట్లు (5.5%) క్షీణించగా, నాస్డాక్ కూడా 5.8 శాతం పడిపోయింది.యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలు శుక్రవారం రికార్డు స్థాయిలో 26.79 బిలియన్ షేర్లను ట్రేడ్ చేశాయి. ఇది 2021 జనవరి 27 నాటి గరిష్ట స్థాయి 24.48 బిలియన్లను అధిగమించింది. నాస్డాక్ 962.82 పాయింట్లు క్షీణించి 15,587.79 వద్ద ముగిసింది. దాని డిసెంబర్ 16 నాటి రికార్డు ముగింపు గరిష్టం 20,173.89 నుండి 20 శాతానికి పైగా పడిపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231.07 పాయింట్లు క్షీణించి 38,314.86 వద్దకు దిగజారింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఎస్&పీ 500 సూచీ 322.44 పాయింట్లు క్షీణించి 5,074.08 వద్దకు పడిపోయింది. 11 నెలల్లో ఇదే అత్యల్ప ముగింపు.అన్ని షేర్లకూ నష్టాలే..ఎస్&పీ 500 సూచీలో ఉన్న 500 కంపెనీల్లో 12 మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. ముడి చమురు ధర 2021 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందనే ఆందోళనలతో ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలైన రాగి వంటి లోహాల ధరలు కూడా పడిపోయాయి. -
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాల దెబ్బకు కెనడాలో తొలి పతనం చోటుచేసుకుంది. వాహన విడిభాగాలపై విధించిన సుంకాల కారణంగా కార్ల తయారీ సంస్థ స్టెలాంటిస్ ఎన్వీ తన విండ్సర్ ఫ్యాక్టరీని రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.కెనడాలోని విండ్సర్‌లో ఉన్న స్టెలాంటిస్ ప్లాంట్‌లో సుమారు 3,600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ మినీవ్యాన్లు, డాడ్జ్ ఛార్జర్ వాహనాలు తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారంలో ఏప్రిల్ 7 నుంచి ఉత్పత్తిని కంపెనీ నిలిపివేస్తోంది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..ఆటోమోటివ్ దిగ్గజం స్టెలాంటిస్ నిర్ణయం యూఎస్ ప్రభుత్వం విధించే 25% సుంకాల వల్ల ఆటోమోటివ్ పరిశ్రమపై పెరుగుతున్న ఒత్తిడిని నొక్కిచెబుతుంది. ఇది యూఎస్ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చర్య అయినప్పటికీ ఉత్తర అమెరికా ఉత్పత్తి గొలుసులకు అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది.టారిఫ్‌ల ప్రభావంటారిఫ్లు వాహన తయారీదారులకు ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా పెంచనున్నాయి. దీంతో పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టించాయి. విండ్సర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్టెలాంటిస్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ విడిభాగాలు, కార్మికులు, మార్కెట్ల నెట్‌వర్క్‌పై ఆధారపడే తయారీదారులపై ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ఇటువంటి అంతరాయాలు వాహన డెలివరీలో జాప్యానికి దారితీస్తాయని, సరఫరాదారుల సంబంధాలు దెబ్బతింటాయని, వినియోగదారులకు సంభావ్య ధరల పెరుగుదలకు కూడా దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్ టెక్ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల తర్వాత భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 75,364.69 వద్ద స్థిరపడింది. సూచీ 76,258.12 నుంచి 75,240.55 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 345.65 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 22,904.45 వద్ద స్థిరపడింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 8.36 శాతం వరకు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 3.56 శాతం క్షీణించడంతో స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.91 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో స్థిరపడగా, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియల్టీలు 2-6.5 శాతానికి పైగా నష్టపోయాయి. -
దోస రైతులపై సుంకాల పిడుగు
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.99 శాతం ఎగుమతులే..భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?అమెరికా మార్కెట్లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
ప్రతీకార సుంకాల ప్రభావంపై అధ్యయనం
అమెరికా ప్రతీకార సుంకాలతో భారత్‌పై ప్రడే ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖతోపాటు, ఆర్థిక శాఖ ప్రకటించాయి. దేశీ పరిశ్రమ, ఎగుమతిదారులు సహా భాగస్వాములు అందరితో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా కొత్త వాణిజ్య విధానం ఫలితంగా ఏర్పడే కొత్త అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించింది.పరస్పర ప్రయోజనకరమైన, బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) త్వరగా అంగీకారానికి వచ్చేందుకు భారత్–అమెరికా వాణిజ్య బృందాలు చర్చిస్తున్నట్టు తెలిపింది. అమెరికాతో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని భారత్ గౌరవిస్తుందని.. రెండు దేశాల ప్రయోజనాల విషయంలో అమెరికాతో కలసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ‘ట్రంప్‌నకు అమెరికాయే ప్రథమం. మోదీకి భారతే ప్రథమం. అమెరికా మోపిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. భారత్ నుంచి వచ్చే ఫార్మా, సెమీకండక్టర్, ఇంధన ఉత్పత్తుల దిగుమతులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించగా, మిగిలిన దిగుమతులపై 10 శాతం బేసిక్ డ్యూటీకి అదనంగా 26 శాతం సుంకాలు మోపింది.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. -
యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్‌ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్‌ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్‌ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. -
టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం
న్యూఢిల్లీ/ముంబై: భారత ఎగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించనుండగా.. అదే సమయంలో కొన్ని రంగాలకు ఎగుమతి అవకాశాలను విస్తృతం చేయనుంది. ముఖ్యంగా భారత ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో లభించని కొన్ని రకాల అరుదైన ఖనిజాలకు ట్రంప్ సర్కారు టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించింది. మిగిలిన అన్ని ఉత్పత్తులపైనా 27 శాతం అదనపు సుంకాన్ని మోపింది. దీంతో ఆటోమొబైల్ వాహనాలు, వాటి విడిభాగాలు, వైద్య పరికరాలు, రత్నాభరణాల ఎగుమతులపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.రత్నాభరణాల ఎగుమతులకు ఎదురుదెబ్బ: జీజేఈపీసీ అమెరికా విధించిన 27 శాతం ప్రతీకార సుంకాలు భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ (రత్నాలు, ఆభరణాలు) ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బగా జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) పేర్కొంది. అమెరికాకు భారత్ నుంచి ఏటా 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులు జరుగుతుండగా, వీటికి సవాళ్లు ఎదురుకానున్నట్టు పేర్కొంది. ‘‘భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టారిఫ్‌లను అధిగమించేందుకు ఇది కీలకం’’అని జీజేఈపీసీ పేర్కొంది. భారత్ నుంచి అమెరికా ఏటా 11.58 బిలియన్ డాలర్ల మేర జెమ్స్, జ్యుయలరీని దిగుమతి చేసుకుంటుంటే.. అదే సమయంలో భారత్‌కు అమెరికా 5.31 బిలియన్ డాలర్ల రత్నాభరణాలను ఎగుమతి చేస్తోంది. వైద్య పరికరాలకు ప్రతికూలం.. ప్రతీకార టారిఫ్‌లతో మెడికల్ డివైజ్‌ల ఎగుమతులపై ప్రభావం పడనుందని, పరిశ్రమ వృద్ధికి సవాలుగా మారుతుందని ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఏఐఎంఈడీ) ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. 2023–24లో భారత్ నుంచి అమెరికాకు 714.38 మిలియన్ డా లర్ల విలువైన పరికరాలు ఎగుమతయ్యాయి.ఫార్మాకు ఊరట చౌకగా ఔషధాలు అందిస్తున్న భారత ఫార్మాకి ప్రతీకార టారిఫ్‌ల నుంచి ట్రంప్ సర్కార్ మినహాయింపునిచ్చింది. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. 2022లో అక్కడి ప్రతి పది ప్రి్రస్కిప్షన్లలో నాలుగు ప్రిస్క్రిప్షన్లకు సంబంధించిన ఔషధాలు మన కంపెనీలు సరఫరా చేసినవే.జీడీపీ వృద్ధికి నష్టం ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర శాతం తగ్గిపోయి 6%కి పరిమితం కావొచ్చని ఈవై చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ తెలిపారు. అదనపు సుంకాలు విధించడం వల్ల భారత జీడీపీపై గరిష్టంగా 35–40 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా హెడ్ అనుభూతి సహాయ్ అభిప్రాయపడ్డారు. టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలం అమెరికా సుంకాల మోత భారత టెక్స్టైల్స్ ఎగుమతులకు సానుకూలమేనని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. అమెరికాకు టెక్స్‌టైల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న పోటీ దేశాలు చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాల విధింపు భారత్ కంటే అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘మా వద్ద మిగిలి ఉన్న ఖాళీ సామర్థ్యం గురించి ఇప్పటికే అమెరికా కస్టమర్ల నుంచి విచారణలు మొదలయ్యాయి’అని రేమండ్ గ్రూప్ సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ తెలిపారు. భారత్ నుంచి అమెరికా ఏటా 36 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఐటీ సేవలపై పరోక్ష ప్రభావం ఎగుమతి ఆధారిత దేశీ ఐటీ సేవల రంగంపై టారిఫ్‌ల ప్రభావం ప్రత్యక్షంగా పడకపోయినా, తదనంతర పరిమాణాల వల్ల పరోక్ష ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మందగమనం వస్తే తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ తదితర రంగాల్లో డిమాండ్ పడిపోవచ్చని ఆందోళన నెలకొంది. దీంతో ఆ రంగాల్లోని సంస్థలకు సరీ్వసులు అందించే భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆర్జించిన 193 బిలియన్ డాలర్ల ఆదాయాల్లో అమెరికా వాటా 57 శాతంగా నమోదైంది.వాహనాలపై ప్రభావం కొంతే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వాహన రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. మార్చి 26 నాటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండడాన్ని ప్రస్తావించింది. అమెరికా మార్కెట్లో చెప్పుకోతగ్గ విక్రయాలు కలిగిన టాటా మోటర్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు మాత్రం.. ఎగుమతుల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్ డాలర్లుగా ఉండగా, అక్కడినుంచి దిగుమతులు 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
అమెరికా దిగుమతి సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం మార్పులకు లోనుకానుందని సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాశ్ పేర్కొన్నారు. యూఎస్‌లో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదన్నారు. సుంకాల నేపథ్యంలో భారత్‌కు చౌక స్టీల్ దిగుమతుల ముప్పు ఎదురుకావొచ్చని చెప్పారు. అన్ని స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను యూఎస్ ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ నెల 2 నుంచి అన్ని రకాల దిగుమతులపైనా ప్రతీకార సుంకాల విధింపును ప్రకటించడం గమనార్హం.‘సంప్రదాయంగా స్టీల్ ఆసియా దేశాల నుంచి యూఎస్, యూరప్‌కు ఎగుమతి అవుతుంటుంది. కొంత స్టీల్ యూరప్ నుంచి యూఎస్‌కు వెళుతుంటుంది. ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ఆయా ఎగుమతులు లాభసాటి కావు. దాంతో యూరప్‌కు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఎగుమతి చేసే స్టీల్ ప్రపంచ దేశాలను ముంచెత్తుతుంది. ఇది భారత్‌కు కూడా రావొచ్చు’ అని సెయిల్ ఛైర్మన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికాకు భారత్ స్టీల్ ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో టారిఫ్‌ల ప్రభావం మనపై తక్కువే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు‘అమెరికాలో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదు. దీంతో తాము ఉత్పత్తి చేయలేని వాటి దిగుమతులను అమెరికా కొనసాగిస్తుంది. అక్కడ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటుంది’ అని వివరించారు. దేశీ స్టీల్ పరిశ్రమను చౌక దిగుమతుల నుంచి కాపాడేందుకు సుంకాల విధింపు అవసరమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సేఫ్‌గార్డ్ డ్యూటీని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ గత నెలలో సిఫారసు చేయడం గమనార్హం. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. -
ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
అమెరికా తాజాగా విధించిన ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా పరిశ్రమకు మినహాయింపు ఇస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొత్తం యూఎస్‌లో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అమెరికాలోనూ ఔషధాల సంక్షోభాన్ని తీసుకొస్తుందేమోననే ఆందోళనలతో ఈమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారతదేశం తయారు చేస్తున్న జనరిక్ మందుల పాత్రను నొక్కి చెబుతుంది.ఈ సుంకాల మినహాయింపు భారత ఔషధ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా, ఇతర రంగాల్లో అమెరికా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా సుంకాలకు అనుగుణంగా భారత్ యూఎస్ వస్తువులపై సుంకాల్లో మార్పులు చేస్తే వాణిజ్య అడ్డంకులు తొలగిపోయి దేశంలో అగ్రరాజ్య ఎగుమతులు ఏటా 5.3 బిలియన్ డాలర్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇది రెండు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తుందనే వాదనలూ లేకపోలేదు.భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్ ఏర్పాటుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి. -
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు.