న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 నుంచి 6.3 శాతం వరకూ పురోగమిస్తుందని డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి తీవ్రత తగ్గితే వచ్చే రెండేళ్లలో 7 శాతం వరకూ కూడా వృద్ధి పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా?
అర్బన్ డిమాండ్‌సహా దేశీయంగా ఆటోమొబైల్, యూపీఐ లావాదేవీలు, దేశీయ విమాన ప్రకాణాలు, ట్రాక్టర్ అమ్మకాలు, ఐఐపీ నాన్–డ్యూరబుల్ గూడ్స్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గణాంకాలు.. పూర్తి సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. (ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?)
Comments
Please login to add a commentAdd a comment