న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment