రానున్న నాలుగేళ్లల్లో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు.
2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.
ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం..
గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్‌డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment