GDP estimates
-
నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?
రానున్న నాలుగేళ్లల్లో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం.. గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు. -
మార్కెట్లపై సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఫిబ్రవరి నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు ముగిసే రోజు కావడం, భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై చూపించింది. దీంతో ఉదయం ఆశాజనకంగా ప్రారంభమై లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య స్వల్ప శ్రేణి పరిధిలో కదలాడుతూ... చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 35,829 వద్ద క్లోజ్ అవగా, అటు నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టపోయి 10,792 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,865–10,785 మధ్య ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ‘‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కారణంగా మార్కెట్ ఓ శ్రేణికి పరిమితమైంది. మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువ రోజుల పాటు కొనసాగవని ఇన్వెస్టర్లు భావించారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనికి అదనంగా ఆర్థిక గణాంకాలు, ఎన్నికల ముందుస్తు ర్యాలీ, ఎఫ్ఐఐల నిధుల రాక పెరగడం, రూపాయి బలోపేతం వంటి వాటిపైకి దృష్టి మళ్లిందన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్చి సిరీస్‌కు పొజిషన్లను క్యారీ ఫార్వార్డ్ చేసుకోకుండా, వాటిని క్లోజ్ చేసేందుకు మొగ్గు చూపించినట్టు బ్రోకర్లు తెలిపారు. మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వినోద్ నాయర్ చెప్పారు. ఆర్ఈసీ రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 11 రూపాయలను మధ్యంతర డివిడెండ్‌గా ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణాల సమీకరణ పరిమితిని రూ.60,000 కోట్ల నుంచి రూ.85,000 కోట్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ‘కిరణ్’ ఇన్ఫోసిస్ షేర్ల అమ్మకం... ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్ మంజుందార్ షా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు సంబంధించి 1,600 షేర్లను విక్రయించిన విషయం వెలుగు చూసింది. బయోకాన్ చైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ కంపెనీ బోర్డులో లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవల ద్వారా ఆమె షేర్లను ముందస్తు అనుమతి లేకుండా అనుకోకుండా విక్రయించినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ‘‘కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆడిట్ కమిటీ సమీక్ష అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ పాలసీ, ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించాం. కిరణ్ మజుందార్ షాపై రూ.9.5 లక్షల పెనాల్టీని విధించడం జరిగింది. కిరణ్ మజుందార్ షా ముందస్తు అనుమతి లేకుండా తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా 1,600 షేర్లను విక్రయించినట్టు ఇన్ఫోసిస్ కాంప్లియన్స్ ఆఫీసర్ దృష్టికి ఫిబ్రవరి 13న వచ్చింది’’ అని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో మేనేజర్ షాకు తెలియకుండానే ఈ పనిచేసినట్టు వివరణ ఇచ్చింది. -
షాంఘై పతనంతో నష్టాలు
ప్రభావం చూపిన మూడీస్ జీడీపీ అంచనాల తగ్గింపు - 47 పాయింట్ల నష్టంతో 27,832కు సెన్సెక్స్ - 11 పాయింట్లు క్షీణించి 8,467కు నిఫ్టీ భారత జీడీపీ అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 7 శాతానికి తగ్గించడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ 6 శాతం పతనం కూడా తోడవడంతో వరుసగా రెండోరోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 27,832 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8,467 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇప్పటివరకూ సగటు వర్షపాతం కంటే 10 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయన్న వాతావారణ శాఖ నివేదిక ప్రభావం చూపింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో చైనా షేర్ల పతనం కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభాలు కొనసాగుతున్నాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ఆగష్టు 25 నుంచి పెబ్స్ పెన్నార్ ఇష్యూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. పూర్తి బుక్ బిల్డింగ్ విధానంలో జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ధరను రూ. 170 - 178గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కొత్తగా రూ. 58 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడంతోపాటు, 55.16 లక్షల షేర్లను విక్రయించనున్నారు.