GDP estimate
-
నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?
రానున్న నాలుగేళ్లల్లో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం.. గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు. -
క్యూ2లో జీడీపీ స్మార్ట్ రికవరీ!- ఎస్బీఐ రీసెర్చ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కోవిడ్-19 కారణంగా షాక్తగలనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. క్యూ1(ఏప్రిల్- జూన్)లో దేశ జీడీపీ ఏకంగా 40 శాతం క్షీణించనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. అయితే ఈ ఏడాది రెండో క్వార్టర్(జులై- సెప్టెంబర్) నుంచీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునే వీలున్నట్లు పేర్కొంది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.8 శాతం వెనకడుగు వేసే చాన్స్ ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్అంచనా కట్టింది. తొలి క్వార్టర్లో జీడీపీ 40 శాతానికి మించి క్షీణించే వీలున్నట్లు చెబుతోంది. క్యూ2లో 7.1 శాతం బౌన్స్‌బ్యాక్ కానున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ద్వితీయార్ధంలోనూ ఆర్థిక వ్యవస్థ బలపడే వీలున్నట్లు తెలియజేసింది. చివర్లో స్టిములస్ ఈ ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి మరో సహాయక ప్యాకేజీ వెలువడే అవకాశమున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేస్తోంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వీలున్నట్లు పేర్కొంది. కాగా.. ఈ ఏడాది క్యూ1లో జీడీపీ 25 శాతం నీరసించవచ్చని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ అంచనా వేసింది. దేశం తొలిసారి తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. వెరసి ఈ ఏడాది దేశ జీడీపీ 5 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. ఇప్పటికే విదేశీ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్.. ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల(మైనస్) వృద్ధిని చవిచూడనున్నట్లు అంచనా వేసింది. దీంతో ముందుగా వేసిన 0.8 శాతం వృద్ధి అంచనాలను మైనస్ 5 శాతానికి సవరిస్తున్నట్లు తెలియజేసింది. దేశానికి స్వాతంత్ర్యం లభించాక నాలుగోసారి మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు క్రిసిల్ వివరించింది. ఆర్థిక వ్యవస్థకు స్వేచ్చ కల్పించాక తొలిసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు తెలియజేసింది. అయితే క్యూ1లో తీవ్ర మాంద్య పరిస్థితులు కనిపించనున్నట్లు పేర్కొంది. చివరి వారంలో జూన్ చివరి వారంలో దేశీయంగా కోవిడ్-19 కేసులు చివరి దశకు చేరుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేస్తోంది. క్యూ3, క్యూ4లో పరిస్థితులను గమనించాక ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవసరం ఏర్పడవచ్చని భావిస్తున్నట్లు ఎస్బీఐ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. కాగా.. కోవిడ్-19 ప్రభావంతో రాష్ట్రాలకు రూ. 30 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 90 శాతం నష్టాలు రెడ్, ఆరెంజ్ జోన్లనుంచే నమోదుకావచ్చని తెలియజేసింది. రాష్ట్రాలవారీగా చూస్తే 15.6 శాతం వాటాతో మహారాష్ట్ర అత్యధికంగా నష్టపోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో తమిళనాడు 9.4 శాతం, గుజరాత్ 8.6 శాతం చొప్పున నష్టపోయే వీలున్నట్లు అంచనా వేసింది. -
‘మోదీ సర్కార్‌కు తీపికబురు’
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌కు ఫిచ్ రేటింగ్స్ తీపికబురు అందించింది. 2018-19లో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతం నమోదవుతుందని పేర్కొంది. నిర్మాణ, ఉత్పాదక, సేవా రంగాలు మెరుగైన సామర్థ్యం కనబరుస్తున్నాయని అంచనాలకు అనుగుణంగా వృద్ది రేటు ఉంటుందని తెలిపింది. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎదురైన ప్రతికూల పరిణామాలు చాలావరకూ కనుమరుగయ్యాయని ఫిచ్ గ్రూప్ కంపెనీ బీఎంఐ రీసెర్చ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి 7.3 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలకు అనుగుణంగానే బీఎంఐ రీసెర్చి నివేదిక అంచనా వెలువడటం గమనార్హం. 2018-19లో వృద్ధి రేటు 7.4 శాతం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవల క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బీఎంఐ నివేదిక ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు భారత వృద్ది రేటు 7.5 శాతంగా ఉంటుందని ఇటీవల డచ్ బ్యాంక్ రీసెర్చ్ నివేదిక సైతం అంచనా వేసింది. -
మూడీస్ అలా..ఫిచ్ ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ: మూడీస్ రేటింగ్‌తో ఆర్థిక వ్యవస్థపై జోష్ నెలకొంటే..తాజాగా ఫిచ్ రేటింగ్స్ నిరుత్సాహపరిచింది. ప్రస్తుత ఆర్థిఖ సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్ తగ్గించింది. ఆశించిన మేర ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నెలకొనలేదని పేర్కొంది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవ్సరానికి వృద్ధి అంచనాను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. రాబోయే రెండేళ్లలో వ్యవస్ధాగత సంస్కరణల అజెండా అమలుతో పాటు వ్యక్తిగత వినిమయ ఆదాయాలు పెరగడంతో జీడీపీ వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్టీ,నోట్ల రద్దు కారణంగా ఇటీవల పలు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి మందగించిందని అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు వృద్ధికి ఊతమిచ్చి, వ్యాపారాల్లో విశ్వాసం పెంచుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకులకు మూలధన సాయం,రూ ఏడు లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం వంటి చర్యలతో పెట్టుబడుల వాతావరణం ఊపందుకుంటుందని పేర్కొంది. -
జీడీపీ అంచనాల్లో చాలా తప్పులున్నాయ్!
న్యూఢిల్లీ : భారత ప్రస్తుత ఆర్థికసంవత్సర వృద్ధి రేటు పడిపోతుందంటూ కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించిన అంచనాల్లో చాలా లోపాలున్నాయట. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలను డేటాలో ప్రభుత్వం కలుపకపోవడంతో ప్రధాన లోపంగా దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఐక్రా ఎత్తిచూపింది. 2016-17లో దేశ వృద్ధి రేటు 6.8 శాతానికి పడిపోతుందని ఈ ఏజెన్సీ శుక్రవారం అంచనావేసింది. 2016 నవంబర్ నెల మధ్య నుంచి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రారంభమైంది. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అక్టోబర్ వరకున్న డేటాతోనే ప్రభుత్వం వృద్ధి అంచనాలు ప్రవేశపెట్టింది. ముందటి సంవత్సరాలకంటే ప్రస్తుత అంచనాల్లో చాలా తప్పులున్నాయని, నగదుతో ముడిపడి ఉన్న కన్స్ట్రక్షన్ సెక్టార్ లాంటి వాటిలో తప్పులు దొర్లిన్నట్టు ఐక్రా ఓ ప్రకటనలో తెలిపింది. 2017లో వృద్ధిపై సీఎస్ఓ ప్రకటించిన ముందస్తు అంచనాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం లేదని, వారు ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రథమార్థ డేటానే పరిగణలోకి తీసుకున్నట్టు ఐక్రా చెప్పింది. కానీ తయారీరంగం, వ్యవసాయం, విద్యుత్, నిర్మాణ వంటి సబ్-సెక్టార్లలో ప్రభుత్వం విడుదల చేసిన ముందస్తు అంచనాల కంటే ఇంకా ఎక్కువగానే వృద్ధి రేటు పడిపోతుందని ఐక్రా వివరించింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీల మూడో క్వార్టర్ ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం, రబీ ఉత్పత్తిపై ముందస్తు అంచనాలు కూడా గణాంకాల కచ్చితత్వంపై ప్రశ్నార్థకంగా మారినట్టు ఐక్రా తన ప్రకటనలో తెలిపింది.