2024–25 అంచనాలు యథాతథమన్న ఎస్‌అండ్‌పీ
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు సవాళ్లు డిమాండ్‌ను తగ్గిస్తాయని తన తాజా ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2023–24లో భారత్ 8.2 శాతం వృద్ధి రేటు సాధనను సైతం ఈ సందర్భంగా ఎస్‌అండ్‌పీ ప్రశంసించింది.
2024–25కు సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్ తాజా రేటింగ్స్ ఉద్ఘాటన.. ఆర్‌బీఐ అంచనా 7.2శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. గ్లోబల్ రేటింగ్ దిగ్గజం తాజా అవుట్‌లుక్‌లో ము ఖ్యాంశాలు చూస్తే.. 2025–26, 2026– 27లో భారత్ వృద్ధి రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతాలుగా ఉంటాయి. 2024లో చైనా వృద్ధి అంచనా 4.6 శాతం నుంచి 4.8 శాతానికి పెంపు. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) చైనా ఎకానమీ మందగమనాన్ని చూస్తుంది. ఒకవైపు తగ్గిన వినియోగం, తయారీ పెట్టుబడుల పెరుగుదల వంటి కీలక అంశాలు లాభాల మార్జిన్‌లపై ప్రభావం చూపుతాయి.
Comments
Please login to add a commentAdd a comment