న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ 2023-24 ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కీలక విషయాలను ప్రకటించారు. ఇది అమృత కాల బడ్జెట్ అనీ,దీనికి గత బడ్జెట్ లోనే గట్టి పునాది పడిందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన దేశం తలయెత్తుకొని సగర్వంగా నిల బడిందనీ, సమిష్టి ప్రగతి దిశగా దేశం పయనిస్తుందని నిర్మలా భరోసా ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అత్యంత వేగంగా ఉందన్నారు. వృద్ధి రేటును 7శాతంగా అంచనావేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా పేదలు, యువత, మహిళలు, రైతులు ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అంత్యోదయ వర్గాల వారికి సంత్సరం పాటు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం జనవరి 2023 నుంచి ఉచిత ధాన్యాల పంపిణీ స్కీంను ప్రశేపెడుతున్నాం. దీని య్యే మొత్తం ఖర్చును 2 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుంది. కోవిడ్ , యుద్ధం లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా గ్లోబల్‌గా నెలకొన్న మాంద్యం పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థంగా దృఢంగా నిలబడింది. కోవిడ్ అడ్డుకోవడంలో చాలా వేగంగా పనిచేశాం. 102 కోట్ల మందికి వ్యాక్సన్స్ అందించాం వ్యాక్సినేషన్ డ్రైవ్ శరవేగంగా చేపట్టామని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment