న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ బడ్జెట్ 2023కి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూనియన్ బడ్జెట్ 2023లో 'ప్రతీ విభాగం' చేర్చామని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాల అంచనాలను అందుకోబోతున్నాం. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు అనుకూలంగా పని చేస్తుందంటూ పేర్కొన్నారు.
మరోవైపు రానున్న బడ్జెట్‌పై కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక సర్వే అంనాలు మరింత ఆశా జనకంగా ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా అయిదోసారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment