దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గాన్‌స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003–2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదేమాదిరి వృద్ధి కనబరుస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది.
భారత జీడీపీ 2003-07 కాలంలో ఏడాదికి సగటున 8.6 శాతం చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని నిదేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ పెట్టుబడులు పెరగడంతో ఎకానమీ వృద్ధి చెందుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. వినియోగం తగ్గినా, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్‌ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది.
నివేదిక ప్రకారం.. ప్రభుత్వం చేసే మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. జీడీపీ వృద్ధి 2003–2007 సమయంలో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుంది. ఇదే గరిష్ట వృద్ధిగా నమోదైంది.
ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
2011–21 మధ్య పెట్టుబడులు తగ్గినా ప్రస్తుతం జీడీపీ 34 శాతం దగ్గర ఉందని వివరించింది. భవిష్యత్తులో ఇది 36 శాతానికి చేరుతుందని అంచనా. 2003–2007 లో ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment