ముంబై: ఇంటి రుణ భారం (దేశవ్యాప్తంగా గృహస్థుల రుణాలు) దేశ జీడీపీలో 34 శాతానికి జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు ఎస్‌బీఐకి చెందిన పరిశోధన విభాగం ఒక నివేదికలో వెల్లడించింది. 2019–20 నాటికి జీడీపీలో 32.5 శాతంగా ఉన్న కుటుంబ రుణ భారం.. కరోనా కారణంగా 2020–21 నాటికి 37.3 శాతానికి పెరగడం గమనార్హం.
తమ అంచనాల మేరకు ఇది ఈఏడాది జూన్ ఆఖరుకు జీడీపీలో 34 శాతానికి తగ్గి ఉంటుందని నివేదిక తెలిపింది. గృహస్థుల రుణ భారం 2020–21 చివరికి ఉన్న రూ.73.59 లక్షల కోట్ల నుంచి 2021–22 మొదటి త్రైమాసికం చివరికి రూ.75 లక్షల కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. శాతం వారీగా తగ్గినట్టు కనిపిస్తున్నా..అంకెల వారీగా పెరిగినట్టు తెలుస్తోంది.
‘‘2018తో ముగిసిన ఆరేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 84 శాతం పెరగ్గా.. పట్టణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 42 శాతం మేర పెరిగింది. ఇదే ఆరేళ్ల కాలంలో 18 రాష్ట్రాల్లోని పల్లెల్లో గృహస్థుల సగటు రుణం రెట్టింపైంది’’ అని ఈ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment