Household debt
-
34 శాతానికి తగ్గిన కుటుంబాల రుణ భారం
ముంబై: ఇంటి రుణ భారం (దేశవ్యాప్తంగా గృహస్థుల రుణాలు) దేశ జీడీపీలో 34 శాతానికి జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు ఎస్బీఐకి చెందిన పరిశోధన విభాగం ఒక నివేదికలో వెల్లడించింది. 2019–20 నాటికి జీడీపీలో 32.5 శాతంగా ఉన్న కుటుంబ రుణ భారం.. కరోనా కారణంగా 2020–21 నాటికి 37.3 శాతానికి పెరగడం గమనార్హం. తమ అంచనాల మేరకు ఇది ఈఏడాది జూన్ ఆఖరుకు జీడీపీలో 34 శాతానికి తగ్గి ఉంటుందని నివేదిక తెలిపింది. గృహస్థుల రుణ భారం 2020–21 చివరికి ఉన్న రూ.73.59 లక్షల కోట్ల నుంచి 2021–22 మొదటి త్రైమాసికం చివరికి రూ.75 లక్షల కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. శాతం వారీగా తగ్గినట్టు కనిపిస్తున్నా..అంకెల వారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘2018తో ముగిసిన ఆరేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 84 శాతం పెరగ్గా.. పట్టణ ప్రాంతాల్లోని వారి రుణ భారం 42 శాతం మేర పెరిగింది. ఇదే ఆరేళ్ల కాలంలో 18 రాష్ట్రాల్లోని పల్లెల్లో గృహస్థుల సగటు రుణం రెట్టింపైంది’’ అని ఈ నివేదిక పేర్కొంది. -
గృహ రుణం మంచిదే...
నా వయస్సు 30 సంవత్సరాలు. ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. నా జీతం రూ.70,000. ఏడాదికి 5 శాతం చొప్పున వేతన పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నాను. ఇటీవలనే .28 లక్షలకు గృహ రుణం తీసుకున్నాను. నెలకు రూ.29,000 చొప్పున ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఈ గృహ రుణ కాలపరిమితి 30 సంవత్సరాలు. నాకు 60 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి ఈ రుణం తీరుతుంది. నా భార్య గృహిణి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు, మా నాన్నగారు నా దగ్గరే ఉంటారు. వీరంతా నాపై ఆధారపడి ఉన్నవాళ్లు. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మదుపు చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే 14 శాతం, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 8.5 శాతం చొప్పున రాబడులు వస్తాయని మిత్రులు చెబుతున్నారు. గృహ రుణం ముందుగానే తీర్చివేసి, ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయాలా? గృహ రుణం చెల్లిస్తూనే ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? పీపీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సూచనలివ్వండి? - జీవన్ కుమార్, విశాఖపట్టణం గృహ రుణానికి సంబంధించి నెలవారీ సమాన వాయిదాలు(ఈఎంఐ)లు చెల్లించడంలో మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే, ఈ గృహ రుణం అసలులో కొంత మొత్తాన్ని తీర్చేయండి. మీరు సౌకర్యవంతంగా ఈఎంఐ చెల్లించగలిగిన స్థాయిలో గృహ రుణం అసలులో కొంత మొత్తాన్ని తీర్చేయండి. ఒకవేళ గృహరుణ ఈఎంఐలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే, ముందస్తు చెల్లింపులు విషయం మరచిపోండి. పన్ను ఆదా చేసే లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో మదుపు చేయడం ప్రారంభించండి. గృహ రుణం మంచి రుణం అని చెప్పవచ్చు. ఈ రుణం వల్ల ఒక ఆస్తి మన సొంతమవుతుంది. అంతేకాకుండా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పర్సనల్ లోన్ తదితర ఇతర అన్సెక్యూర్డ్ రుణాలతో పోల్చితే వడ్డీరేట్లు తక్కువగానే ఉంటాయి. అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చే క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ మంచి రుణాలు కావు. ఒకవేళ ఇలాంటివి ఉంటే, అన్నింటికంటే ముందుగానే ఈ రుణాలను తీర్చేయాలి. వీటిమీద 20-30 శాతం వరకూ వడ్డీ కడుతూ, 7-15 శాతం వడ్డీ వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం సరైనది కాదు. మీ గృహ రుణం మొత్తం తీరిన తర్వాత ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన విధానం కాదు. చిన్న మొత్తాలతోనైనా, చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల చక్రవడ్డీ కారణంగా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా, త్వరగా సాధించగలుగుతారు. పన్ను ఆదా మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ను పరిశీలించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఇవే. ఈఎల్ఎస్ఎస్ లేదా ఇతర ఈక్విటీ సాధనాల్లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసేలా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. నేను రూ.8 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలను. ఒక సంవత్సరం తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున నాకు డబ్బులు అవసరమవుతాయి. వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. తగిన సూచనలివ్వండి. - సమున్నత, విశాఖపట్టణం మీరు వాస్తవదూరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏడాదికి 25 శాతం రాబడి వస్తేనే మీకు సంవత్సరం తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున పొందగలరు. ఈ తరహా రాబడులను ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థా ఆఫర్ చేయడం లేదు. నా వయస్సు 63 సంవత్సరాలు. గతంలో బ్యాంకులో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి రూ.6 లక్షలు ఇటీవలనే నా చేతికొచ్చాయి. వీటిని బ్యాంకులో మళ్లీ రీఇన్వెస్ట్ చేయాలనుకోవడం లేదు. వీటిపై వచ్చే రాబడులు పన్నులు పోను చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ రూ.6 లక్షలను మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. కొంత రిస్క్ భరించగలను. ఏడాదికి 9 నుంచి 10 శాతం రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. ఇప్పటికే కొన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. - హఫీజ్, హైదరాబాద్ ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను రికమెండ్ చేయలేము. పన్నులు పోను తగిన రాబడులు రావాలంటే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను అంశాల పరంగా వీటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. అందుకని ఏడాది దాటిన తర్వాత వీటిని విక్రయిస్తే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల కాలానికి మించిన ఇన్వెస్ట్మెంట్ కోసం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను, మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ)లను పరిశీలించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకున్న డీమ్యాట్ అకౌంట్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - నర్మద, గుంటూరు మీ ట్రేడింగ్ అకౌంట్ మీ డీమ్యాట్ అకౌంట్లో అనుసంధానమై ఉంటే, మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు. అయితే పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతాం. ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోల్చితే బంగారం భిన్నమైనది. బాండ్లలలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్లు, బోనస్‌లు, ధర పెరగడం.. ఇలాంటి ప్రయోజనాలుంటాయి. కానీ బంగారం విలువ మాత్రం డిమాండ్, సరఫరా అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులున్నప్పటినుంచి పుత్తడి పెట్టుబడులు మంచి రాబడులనిచ్చాయి. గత ఐదేళ్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లు చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను ఇవ్వలేదు. గత ఐదేళ్లలో ఇవి 3 శాతం కంటే తక్కువ రాబడులనే ఇచ్చాయి. ఏడాది నుంచి -మూడేళ్ల కాలానికి కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు నష్టాలను కూడా ఇచ్చాయి. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై పునరాలోచన చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణం ప్రీపేమెంట్ చేస్తున్నారా?
గృహ రుణం అనేది ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈఎంఐలు కట్టడం భారం కావొచ్చు. అలాంటప్పుడు అనుకోకుండా పెద్ద మొత్తం ఎప్పుడైనా చేతికి వస్తే ముందుగా.. గృహ రుణాన్ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకుంటాం. మరి అలాంటి సందర్భాల్లో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? గరిష్టంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? అన్నది తెలియచెప్పేదే ఈ కథనం. అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళిక.. గృహ రుణం అనేది ఒకటి రెండేళ్లలో తీరేది కాదు. దీర్ఘకాలం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఏదైనా ఇతర రుణం తీసుకోవాలన్నా దానిపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఒక భారీ గృహ రుణం ఉన్నందున భవిష్యత్‌లో మరో రుణం తీసుకోవడం కొంత కష్టం కావొచ్చు. గతంలో డిఫాల్ట్ అయిన పక్షంలో ఒకవేళ ఎలాగోలా రుణం దక్కించుకున్నా, వడ్డీ రేటు భారీగా ఉంటుంది. దీనికితోడు రుణం మొత్తం తీరేలోగా ఇతరత్రా ఏవో అత్యవసరాలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా ఒకోసారి ఈఎంఐల చెల్లింపు కష్టం కూడా కావొచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే.. కనీసం ఆరు నెలల ఈఎంఐ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉంచడం గానీ లేదా అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు కల్పించే సాధనంలో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ మొత్తం పోగా మిగతా డబ్బును ప్రీపేమెంటు కోసం ఉపయోగించవచ్చు. గృహ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం.. కొన్ని సార్లు మీరు రుణం తీసుకున్న బ్యాంకుకన్నా మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేటుపై లోన్లు ఇస్తుంటాయి. అడిగితే ప్రస్తుత బ్యాంకు కూడా వడ్డీ రేటు తగ్గించే అవకాశాలూ ఉన్నాయి. అలా కుదరనప్పుడు మీ లోన్‌ను సదరు బ్యాంకుకు బదలాయించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, వర్తించే స్టాంపు డ్యూటీ మొదలైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కొత్త బ్యాంకుకు బదలాయించే ఖర్చులకన్నా తక్కువగా.. కొంత ఫీజుతో ప్రస్తుత బ్యాంకే వడ్డీ రేటు తగ్గించేందుకు ఒప్పుకుంటే, దానితోనే కొనసాగవచ్చు. అనిల్ కొత్తూరి సీఈవో, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ తీర్చే ముందు చూడాల్సిందేమంటే.. * అనుకోకుండా వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి ప్రీ-పే చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఆ డబ్బు ఇక మన చేతిలో లేనట్లే. ఆ తర్వాతెప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఇతరత్రా ఏ అవసరాలు వచ్చినా ఆ డబ్బు అందుబాటులో ఉండదు. * కాబట్టి మంచి రాబడినిచ్చే పెట్టుబడి సాధనం ఏదైనా అందుబాటులో ఉంటే.. అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రాబడులను .. ప్రీపేమెంటు వల్ల వచ్చే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోమ్ లోన్ తీర్చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. * ఫిక్స్డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే.. ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక, దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. * ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంటు చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు చాయిస్‌లు ఉంటాయి. మొదటిదేంటంటే.. నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు కడుతున్నంతే చెల్లింపులు కొనసాగించడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ రుణం తీరుతుంది. రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. * పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతున్న పక్షంలో రెండో చాయిస్‌ను ఎంచుకోవచ్చు. అలా కాని పక్షంలో యథాప్రకారంగా అదే ఇన్స్టాల్మెంట్ కొనసాగిస్తూ రుణా న్ని గడువుకు ముందుగానే తీర్చేయవచ్చు. -
బేస్‌రేటుకే గ్రామీణులకు గృహ రుణం
- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం - రూ. 15 లక్షల వరకూ రుణసౌలభ్యం ముంబై: బేస్‌రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. మహిళా రుణాలను ఇప్పటికే బ్యాంక్ బేస్‌రేటుకు ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం)గృహ రుణ రేటును అందిస్తున్న నేప థ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ తన రుణ బేస్‌ను పెంచుకునేందుకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా... కాగా తమ నిర్ణయంపై బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ ఒక ప్రకటన చేస్తూ... సమాజంలో మెజారిటీ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఐసీఐసీఐ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. తమ 4,052 బ్రాంచీల్లోని 189లో గ్రామీణ రుణాలు లభ్యమవుతాయని తెలిపారు. ‘ఐసీఐసీఐ బ్యాంక్ సరళ్-రూరల్ హౌసింగ్ లోన్’ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ రుణం లభిస్తోంది. రుణ కాలవ్యవధి 3 నుంచి 20 ఏళ్లు. బేస్‌రేటు మార్పులకు అనుగుణంగా ఇచ్చిన రుణంపై వడ్డీరేటు కూడా మారుతుంది. గృహ కొనుగోళ్లు, నిర్మాణం, ఆధునీకీకరణలకుగాను గ్రామీణులకు ఈ రుణ సౌలభ్యం ఉంటుంది. -
గృహ రుణం.. బోలెడు చార్జీలు
బ్యాంకుల్లో గృహ రుణాలు తీసుకునేటప్పుడు సాధారణంగా వడ్డీ రేట్లు మాత్రమే పోల్చి చూసుకుంటూ ఉంటాం. కానీ, హోమ్ లోన్ విషయంలో వడ్డీ రేటే కాకుండా చూసుకోవాల్సిన ఇతర చార్జీలు కూడా చాలా ఉంటాయి. వీటి గురించి తెలుసుకుంటే బెస్ట్ డీల్ దక్కించుకోవడం సాధ్యపడుతుంది. లోన్ మంజూరు చేయడానికి ముందు బ్యాంకులు రుణ దరఖాస్తును ప్రాసెసింగ్ చేస్తాయి (పత్రాల వెరిఫికేషన్ మొదలైనవి). ఇందుకు ప్రాసెసింగ్ చార్జీల కింద కొంత మొత్తాన్ని తీసుకుంటాయి. బ్యాంకును బట్టి తీసుకునే రుణ మొత్తంలో 0.25% - 1% దాకా ఇది ఉండొచ్చు. ఎస్బీఐ వంటి బ్యాంకులు పాతిక లక్షల దాకా రుణాలపై 0.25 శాతం మేర, అంతకు మించి డెబ్భయ్ అయిదు లక్షల దాకా రూ. 6,500 మేర, ఆ పైన రూ. 10,000 మేర ఫిక్సిడ్ ఫీజు తీసుకుంటున్నాయి. అదే హెచ్డీఎఫ్సీ అయితే లోన్ అమౌంటులో 0.50% దాకా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఈ ఫీజుల నుంచి మినహాయింపులు ఇస్తుంటాయి. ఇది కాకుండా.. సదరు ప్రాపర్టీకి చట్టపరమైన చిక్కులేమైనా ఉన్నాయేమో సైతం బ్యాంకులు వెరిఫికేషన్ చేసుకుంటాయి. ఇందుకు లాయర్ల సలహా తీసుకుంటాయి. దీనికయ్యే ఫీజులను కస్టమర్ దగ్గర్నుంచే వసూలు చేస్తాయి. ఒకవేళ ప్రాపర్టీని ముందుగానే సదరు బ్యాంకే ఆమోదించిన పక్షంలో ఇలాంటి ఫీజుల బాదరబందీ ఉండదు. ఇక, మార్ట్గేజ్ డీడ్ చార్జ్ (ఎంవోడీ) అంటూ లోన్ మొత్తంలో దా దాపు అరశాతం దాకా బ్యాంకులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా.. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, డాక్యుమెంటేషన్ చార్జీలు మొదలైనవీ ఉంటాయి.