
ముగింపులో తగ్గిన ఎల్ అండ్ టీ టెక్ లిస్టింగ్ లాభాలు
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు రూ. 860 ఆఫర్ ధరతో పోలిస్తే శుక్రవారం 4.65% ప్రీమియంతో రూ.900 వద్ద లిస్టయ్యింది.
ముంబై: ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు రూ. 860 ఆఫర్ ధరతో పోలిస్తే శుక్రవారం 4.65% ప్రీమియంతో రూ.900 వద్ద లిస్టయ్యింది. తదుపరి 8% వరకూ ర్యాలీ జరిపి రూ. 925 స్థాయిని చేరింది. అయితే ట్రేడింగ్ ముగింపు సమయానికి లిస్టింగ్ లాభాల్ని చాలావరకూ కోల్పోయి, చివరకు 0.59% పెరుగుదలతో రూ. 865 వద్ద క్లోజయ్యింది. తాజా ధర ప్రకారం కంపెనీకి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ. 8,797 కోట్ల మార్కెట్ విలువ లభించినట్లయ్యింది. రూ. 900 కోట్ల సమీకరణకు ఎల్ అండ్ టీ టెక్నాలజీస్ జారీచేసిన ఐపీఓ 2.53 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే.