స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్ బ్రోకింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.
‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.
ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు
నిబంధనల్లో మార్పులివే..
ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment