Stock Broking Companies
-
పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ
స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్ బ్రోకింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపునిబంధనల్లో మార్పులివే..ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి. -
కార్వీ కేసులో డైరెక్టర్ యుగంధర్‌కు ఊరట
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)లో అవకతవకల కేసుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణలో సంస్థ డైరెక్టరు మేకా యుగంధర్‌కు ఊరట లబించింది. క్లయింట్ల నిధుల దుర్వినియోగం విషయంలో ఆయన ప్రమేయమేమీ లేదని తుది ఉత్తర్వుల్లో సెబీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆయన కేఎస్‌బీఎల్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఆధారాలను బట్టి చూస్తే సంస్థలో యుగంధర్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాత్రమే ఉన్నారని, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఆయన జోక్యం లేదని తెలిపింది. వాస్తవానికి 2017లోనే క్లయింట్ల నిధుల దుర్వినియోగ అంశం గురించి ఆయన లేవనెత్తి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరినప్పటికీ సంస్థ సీఎఫ్‌వో, మేనేజ్మెంట్ పట్టించుకోలేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో యుగంధర్ ప్రజావేగుగానే వ్యవహరించారని, ఆయన్ను నేరస్తుడిగా భావించడానికి లేదని సెబీ పేర్కొంది. ఈ కేసులో కేఎస్‌బీఎల్, దాని ప్రమోటరు ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
టెక్నాలజీ వైపు.. స్టాక్ బ్రోకర్ల చూపు!
న్యూఢిల్లీ: వ్యాపార సేవల్లో టెక్నాలజీ వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవడంపై అత్యధిక శాతం స్టాక్ బ్రోకర్లు దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) బృందంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నారు. బ్రోకరేజి సంస్థల సమాఖ్య అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) నిర్వహించిన సర్వేలో సుమారు 71 శాతం బ్రోకరేజీలు ఈ అభిప్రాయాలను వెల్లడించాయి. ఏఎన్ఎంఐలో 900 సంస్థలకు సభ్యత్వం ఉంది. స్టాక్‌బ్రోకింగ్ పరిశ్రమలో ఆర్థిక సాంకేతికతల పాత్ర, వాటి వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఏఎన్ఎంఐ గత నెలలో స్టాక్టెక్ సర్వేను నిర్వహించింది. అధునాతన రీతుల్లో సైబర్ దాడులు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా తమను, కస్టమర్లను రక్షించుకునేందుకు ఆర్థిక సంస్థలు టెక్నాలజీపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోందని ఇందులో వెల్లడైంది. దీని ప్రకారం గతేడాది 39 శాతం స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలు ఐటీ సంబంధ సమస్యలు ఎదుర్కొన్నాయి. ఫిన్‌టెక్ కంపెనీల బాట... ఎక్కువగా సాంకేతికతతో పని చేసే ఫిన్‌టెక్ కంపెనీలు పెరుగుతుండటంతో ..వాటితో దీటుగా పోటీపడేందుకు సాంప్రదాయ ఆర్థిక సంస్థలు కూడా తమ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తోంది. 2022–23లో సగటున 30 శాతం పెట్టుబడులు సాంకేతికతపైనే వెచ్చించవచ్చని అంచనాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వ్యాపార ప్రక్రియల్లో 33 శాతం భాగం ఫిజికల్ నుంచి డిజిటల్‌కు మారాయి. డిజిటల్‌కు మారడం వల్ల ట్రేడింగ్ లావాదేవీల సమర్ధత, వేగం పెరగడం.. వ్యయాల తగ్గుతుండటం, అందుబాటులో ఉండే పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితిలోనూ కమ్యూనికేషన్‌కు ఆటంకం కలగకుండా పరిశ్రమ నిలబడేలా టెక్నాలజీ తోడ్పడిందని సర్వే నివేదిక పేర్కొంది. సైబర్ దాడుల నుంచి వ్యాపారాలు సురక్షితంగా ఉండేలా కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనలు దోహదపడగలవని 92 శాతం సంస్థలు ఆశాభావంతో ఉన్నట్లు వివరించింది. -
కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు
హైదరాబాద్: కార్వీ షేర్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణహరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
2021లో పెట్టుబడికి 6 స్టాక్స్
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 కలవర పెట్టినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ఏడాది కాలంలో బలంగా పుంజుకున్నాయి. మార్చిలో నమోదైన మూడేళ్ల కనిష్టాల నుంచి 79 శాతం ర్యాలీ చేయగా.. ఇటీవల సరికొత్త గరిష్ట రికార్డులను సైతం సాధించాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అమలు చేసిన సహాయక ప్యాకేజీలతో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీనికితోడు.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి 2021లోనూ మార్కెట్లు లాభాల దౌడు తీసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొంతమేర కన్సాలిడేషన్ జరిగే వీలున్నట్లు చెప్పారు. (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) ప్లస్- మైనస్.. రికవరీ బాటపట్టిన ఆర్థిక వ్యవస్థ కారణంగా కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలుంది. మరోవైపు కోవిడ్-19 కట్టడికి ఇప్పటికే యూకే, యూఎస్, భారత్‌సహా పలు దేశాలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది(2021)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 15,000 పాయింట్ల సమీపానికి చేరుకోగలదని రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. ఫండమెంటల్ విలువలో చూస్తే 13,500 స్థాయిలో నిఫ్టీకి బలమైన సపోర్ట్ లభించగలదని అభిప్రాయపడింది. ఒకవేళ రిస్కులు పెరిగి ఈక్విటీలలో అమ్మకాల పరిస్థితి తలెత్తితే నిఫ్టీ 11,600 వరకూ తిరోగమించే అవకాశమున్నదని వివరించింది. 2020 నవంబర్వరకూ చూస్తే గత 12 నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 17.7 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. ఒక్క నవంబర్లోనే ఏకంగా 8.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు చౌక వడ్డీ రేట్లతో భారీగా లభిస్తున్న నిధులు కారణమైనట్లు రీసెర్చ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది కొనసాగితే మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. అయితే పెట్టుబడుల ట్రెండ్ యూటర్న్ తీసుకుంటే.. మార్కెట్లు పతనమయ్చే చాన్స్ కూడా ఉన్నదని తెలియజేసింది. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) అప్రమత్తత అవసరం ప్రస్తుతం మార్కెట్లు కొంతమేర ఖరీదుగా ఉన్నట్లు బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్ పేర్కొంది. 22- 23 రెట్లు పీఈ(అధిక విలువ)లో కదులుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్లలో కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్ట్ చేయడం మేలని బ్రోకింగ్ సంస్థలు సూచించాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఇంజినీరింగ్, ఎన్బీఎఫ్సీ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని షేర్‌ఖాన్ అభిప్రాయపడింది. రీసెర్చ్ సంస్థల పెట్టుబడి సలహాలు పరిశీలిద్దాం.. బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 20 శాతం వాటాతో మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకుంది. కార్యకలాపాల వృద్ధితో బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకుంది. 2 కోట్ల కస్టమర్లు, రూ. 76,000 కోట్ల లోన్‌బుక్‌ను కలిగి ఉంది. గృహ ఫైనాన్స్ విలీనం తదుపరి లోన్‌బుక్‌లో మార్టిగేజ్ విభాగం వాటా 26 శాతానికి చేరింది. రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా మధ్య, తక్కువస్థాయి ఆదాయ గ్రూప్‌లో పట్టుసాధించాలని ప్రణాళికలు వేసింది. బిర్లా కార్పొరేషన్ దేశీ సిమెంట్ పరిశ్రమలో 4.2 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మార్కెట్లలో పట్టుసాధించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోనూ పటిష్ట కార్యకలాపాలు కలిగి ఉంది. సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న 15.6 ఎంటీపీఏ సామర్థ్యాన్ని 2025కల్లా 25 ఎంటీపీఏకు పెంచుకోవాలని చూస్తోంది. హెచ్‌యూఎల్ ఎఫ్ఎంసీజీ రంగంలో పలు విభాగాలలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తోంది. 70 లక్షలకుపైగా ఔట్లెట్లతో విస్తృత పంపిణీ నెట్వర్క్ కంపెనీ సొంతం. రుణ రహితమేకాకుండా రూ. 5,100 కోట్లకుపైగా నగదు నిల్వలు కలిగి ఉంది. ఇటీవలే జీఎస్కే కన్జూమర్ బిజినెస్‌ను చేజిక్కించుకుంది. తద్వారా రానున్న రెండు, మూడేళ్లలో మరింత లబ్ది పొందనుంది. 2020 సెప్టెంబర్‌కల్లా హైజీన్ విభాగంలో 100 ఎస్‌కేయూలను ప్రవేశపెట్టింది. వీటికితోడు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార బ్రాండ్లు సగటున 10 శాతం వృద్ధిని చూపుతున్నాయి. - హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదిక హాకిన్స్ కుకర్స్ ప్రధానంగా ప్రెజర్ కుకర్స్, కుక్వేర్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ రంగంలోని పోటీ కంపెనీలతో పోలిస్తే ఆదాయంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తోంది. వంటగ్యాస్ కనెక్షన్లు పెరగడం, కంపెనీకున్న బ్రాండ్ ప్రాచుర్యం, విస్తృత నెట్వర్క్ వంటి అంశాల రీత్యా భవిష్యత్‌లోనూ పటిష్ట అమ్మకాలు సాధించే వీలుంది. కోవిడ్-19 నేపథ్యంలో కిచెన్ ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్ కంపెనీకి మేలు చేయనుంది. వర్ల్‌పూల్ ఇండియా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు తదితర పలు వైట్‌గూడ్స్ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తోంది. అంతేకాకుండా చిన్నతరహా అప్లయెన్సెస్‌ను సైతం రూపొందిస్తోంది. దేశ, విదేశీ మార్కెట్లో వీటిని మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు ప్రొడక్టులకు దేశీ మార్కెట్లలో అధిక అవకాశాలున్నాయి. మరోవైపు అధిక డిమాండ్ కనిపిస్తున్న వాటర్ ప్యూరిఫయర్, ఏసీలు, కిచెన్ చిమ్నీల తయారీలోకీ ప్రవేశించింది. సుప్రసిద్ధ బ్రాండ్కావడం, విస్తార పంపిణీ నెట్వర్క్, పటిష్ట పోర్ట్‌ఫోలియో, సామర్థ్య విస్తరణ వంటి అంశాలు కంపెనీ బలాలుగా చెప్పవచ్చు. రాడికో ఖైతాన్ ఐఎంఎఫ్ఎల్ తయారీకి దేశీ సంస్థలలో ముందు వరుసలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కలిగి ఉంది. మ్యాజిక్ మొమెంట్స్ వోడ్కా, 8 పీఎం ప్రీమియం బ్లాక్ విస్కీ తదితర బ్రాండ్లు సుప్రసిద్ధం. సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)లో పోటీ సంస్థల ఆదాయాలు క్షీణతను నమోదు చేసినప్పటికీ అమ్మకాలలో 11 శాతం వృద్ధిని సాధించడం గమనించదగ్గ అంశం. కొత్త ప్రొడక్టుల విడుదల, మార్కెట్ వాటాను పెంచుకుంటుండటం, ప్రీమియం బ్రాండ్లపై దృష్టి, విస్తృత పంపిణీ నెట్వర్క్ వంటి అంశాలు కంపెనీకి మద్దతిస్తున్నాయి. - అమర్జీత్ మౌర్య, ఏవీపీ(మిడ్‌క్యాప్స్), ఏంజెల్ బ్రోకింగ్ (గమనిక: ఇవి రీసెర్చ్ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగేముందు సంబంధిత నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి) -
మోతీలాల్ ఓస్వాల్..టాప్-5 స్టాక్ రికమెండేషన్లు
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కొన్ని దేశాల్లో పరిస్థితులు మెరుగు పడుతుండడంతో...పరిశ్రమల్లో ఉత్పత్తులు పుంజుకుంటున్నాయి. మరికొన్ని దేశాల్లో కేసులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లాక్డౌన్ నింబధనల్లో భారీ సడలింపులను ఆయా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. దీంతో అతిత్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో కనిపిస్తుందని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయని ఈ సమయంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలు విక్రయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ....ఐదు షేర్లను బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సు చేస్తోంది. అవి ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ పేరు: విప్రో బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: తటస్థంగా ఉంచింది టార్గెట్ ధర: రూ.188 ప్రస్తుత ధర: రూ.216 ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో షేరు రేటింగ్‌ను తటస్థంగా ఉంచుతున్నట్లు బ్రోకరేజ్‌సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. షేరు టార్గెట్ ధరను రూ.188 గా నిర్ణయించింది. విప్రో కొత్త సారధిగా థియోరీ డెలాపోర్ట్‌ను విప్రో కంపెనీ ఎంపిక చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఈయన గత కొన్నేళ్లుగా క్యాప్‌జెమినీలో సీఓఓగా పనిచేస్తున్నారు. జూన్ 6 నుంచి విప్రో కంపెనీ సీఈవో,ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇతర టెక్నాలజీ కంపెనీలతో పోలిస్తే విప్రో వృద్ధి పరంగా వెనుకంజలో ఉంది. కొత్త సీఈఓ మార్గనిర్దేశనంలో కంపెనీ వృద్ధి పుంజుకుంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కాగా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో విప్రో కన్సాలిడేటెడ్ విక్రయాలు రూ.15711 కోట్లు నమోదైయ్యాయి. ప్రస్తుతం బీఎస్ఈలో విప్రో షేరు ధర రూ.216.40 గా ఉంది. కంపెనీ పేరు: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.615 ప్రస్తుత ధర: రూ.564 హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరుకు బ్రోకరేజ్ సంస్థ బయ్ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో పీఈ 13 అంచనాతో టార్గెట్ ధరను రూ.615గా నిర్ణయించింది. 50 మిలియన్డాలర్లు వెచ్చించి సిస్కో సెల్ఫ్ ఆప్టిమైజింగ్ నెట్వర్క్(ఎస్ఓఎన్)ను సొంతం చేసుకోకున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఎస్ఓఎస్ అనేది 2జీ నుంచి 5జీ వరకు రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లను అందిస్తుంది. 5 జీ నవీకరణలో ఎస్ఓఎన్ ప్రధాన పాత్ర పోషిస్తునందున ఈ కొనుగోలు హెచ్‌సీఎల్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్‌ను మరింత బలోపేతం చేస్తుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. కాగా ఈ కొనుగోలు ఒప్పందం జనవరి 21 నాటికి పూర్తవుతుందని, సిస్కో నుంచి కొంత మంది ఉద్యోగులను హెచ్‌సీఎల్‌కు తీసుకుంటారని మోతీలాల్ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ధర రూ.564.75 గా ఉంది. కంపెనీ పేరు: నెస్లే ఇండియా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: తటస్థంగా ఉంచింది టార్గెట్ ధర: రూ.16,385 ప్రస్తుత ధర: రూ.17,524 నెస్లే ఇండియా షేరు రేటింగ్‌ను బ్రోకరేజ్ సంస్థ తటస్థంగా ఉంచింది. ఆర్థిక సంవత్సరం-22లో పీఈ 60 అంచనాతో టార్గెట్ ధరను రూ.16,385గా నిర్ణయించింది. సీవై19 వార్షిక నివేదిక నెస్లే ఇండియా బలాన్ని ప్రస్పుటిస్తుందని, భారతీయ మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచిందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వరుసగా మూడో ఏడాది రెండంకెల విక్రయాలు జరిపిందని తెలిపింది. పాలు,పోషక పదార్థాల విక్రయాల్లో 5 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని, చాక్లెట్ విక్రయాల్లో 9 ఏళ్ల వృద్దిని నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో నెస్లే ఇండియా షేరు ధర రూ.17,524.25గా ఉంది. కంపెనీ పేరు: లుపిన్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,000 ప్రస్తుత ధర: రూ.857 లుపిన్ కంపెనీ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తునట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.ఏడాదికాలానికిగాను పీఈ 22 అంచనాతో షేరు టార్గెట్ ధరను రూ.1,000గా నిర్ణయించింది. మూడేళ్ల ఆదాయాల క్షీణత తర్వాత ఆర్థిక సంవత్సరం20-21లలో లుపిన్ కంపెనీ వృద్ధి మెరుగుపడుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. దేశీయ ఫార్ములేషన్ మార్కెట్లో లుపిన్ ప్రదర్శన స్థిరంగా ఉంటుందని చెబుతూ ఈషేరును కొనుక్కోవచ్చని ఇన్వెస్టర్లకు సూచిస్తుంది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో లుపిన్ షేరు ధర రూ.857.10 గా ఉంది. కంపెనీ పేరు: జుబిలెంట్ లైఫ్‌సైన్సెస్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.515 ప్రస్తుత ధర: రూ. 464 జుబిలెంట్ లైఫ్‌సైన్సెస్ షేరుకు బయ్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఆర్థిక సంవత్సరం-21లో ఇబిటా 5 రెట్లు, ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 4 రెట్లు అంచనాతో టార్గెట్ ధరను రూ.515 గా నిర్ణయించింది. మూడేళ్ల తరువాత ఈ కంపెనీ మార్జిన్లు క్రమంగా మెరుగు పడుతున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఫార్మాలోనూ, స్పెషాలిటీ బిజినెస్స్లోనూ వృద్ధి కనిపిస్తుందని వెల్లడించింది. కాగాబీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.464.35 గా ఉంది. -
కార్వీ వ్యాపార పునర్వ్యవస్థీకరణ
హైదదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసులుకింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తదితర వ్యాపారాలను ఆరి్థక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్మెంట్ సేవలు, డేటా అన లిటిక్స్, మార్కెట్ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు.. ఆర్థికేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆరి్థక సేవల వ్యాపార విభాగం గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్‌లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్, రిలయన్స్ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్‌ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు. -
కార్వీకి మరో షాక్..!
ముంబై/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సోమవారం ప్రకటించాయి. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా విడుదల చేసిన సర్క్యులర్లలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వివరించాయి. ఈక్విటీ, డెట్ విభాగాల్లో కార్వీ ట్రేడింగ్ టెర్మినల్స్‌ను డీయాక్టివేట్ చేసినట్లు బీఎస్ఈ తెలిపింది. ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ సెగ్మెంట్స్‌లో నిర్దిష్ట ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అటు ఎన్ఎస్ఈ కూడా ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ డెరివేటివ్స్, డెట్, కమోడిటీ డెరివేటివ్స్ వంటి అన్ని విభాగాల్లోనూ కార్వీపై నిషేధం విధించింది. అయితే, బ్రోకింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించనున్నట్లు కార్వీ వర్గాలు తెలిపాయి. ఇది సత్వరమే పరిష్కారం కాగలదని పేర్కొన్నాయి. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వెసులుబాటుకు సెబీ నిరాకరణ.. క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలు (పీవోఏ) ఉపయోగించుకుని వారి ట్రేడ్స్‌ను సెటిల్ చేయడానికి వెసులుబాటు ఇవ్వాలన్న కార్వీ అభ్యర్థనను సెబీ తోసిపుచ్చింది. పీవోఏలను దుర్వినియోగం చేసి, క్లయింట్ల షేర్లను కంపెనీ అక్రమంగా దారి మళ్లించిందని ఆక్షేపించింది. ప్రాథమిక ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్ల పీవోఏలను కార్వీ ఉపయోగించడానికి అనుమతించడం వివేకవంతమైన నిర్ణయం కాబోదని సెబీ స్పష్టం చేసింది. కార్వీ ద్వారా షేర్లను విక్రయించాలనుకుంటున్న క్లయింట్లు.. ఇందుకోసం ఎలక్ట్రానిక్ లేదా ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. విక్రయించిన షేర్లను డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేసేలా బ్రోకింగ్ సంస్థకు క్లయింట్లు సూచనలివ్వడానికి డీఐఎస్ ఉపయోగపడుతుంది. కార్వీపై ఎన్ఎస్ఈ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ ఇంకా కొనసాగుతోందని, క్లయింట్ల షేర్లు.. నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగిందన్నది త్వరలోనే వెల్లడవుతుందని సెబీ వ్యాఖ్యానించింది. పీవోఏను ఉపయోగించుకోవడంపై స్పష్టతనివ్వాలన్న కార్వీ అభ్యర్థ్ధనపై డిసెంబర్ 2లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సెబీకి శాట్ సూచించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్లు.. కార్వీ అక్రమంగా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న షేర్లలో సుమారు 90 శాతం సెక్యూరిటీలు.. తిరిగి క్లయింట్ల ఖాతాల్లోకి చేరాయి. సెబీ తీసుకున్న సత్వర చర్యలతో సుమారు 83,000 మంది ఇన్వెస్టర్లకు తమ షేర్లు తిరిగి వచ్చాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. ‘సెబీ ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఈ పర్యవేక్షణలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతా నుంచి సుమారు 82,599 మంది క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లను బదలాయించడం జరిగింది‘ అని పేర్కొంది. బాకీలు సెటిల్ చేసిన తర్వాత మిగతా వారి ఖాతాల్లోకి కూడా షేర్ల బదలాయింపు పూర్తవుతుందని ఎన్ఎస్డీఎల్ వివరించింది. -
త్వరలో రుణాల వ్యాపారంలోకి జీరోధా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవలే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్సు పొందిన స్టాక్ బ్రోకింగ్ సంస్థ జీరోధా త్వరలో రుణాల విభాగంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని జీరోధా వైస్ ప్రెసిడెంట్ (ఎడ్యుకేషనల్ సర్వీసెస్) కార్తీక్ రంగప్ప వెల్లడించారు. షేర్లపై చిన్న మొత్తాల్లో స్వల్పకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 2017–18లో తమ యూజర్ల సంఖ్య 8 లక్షలకు చేరిందని, వీరిలో యాక్టివ్ యూజర్స్ సంఖ్య 5.5 లక్షల పైచిలుకు ఉందని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం యూజర్ల సంఖ్యను 10–12 లక్షలకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో తమకు 41,000 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 31,000 మంది క్లయింట్స్ ఉన్నారని జీరోధా ఏవీపీ సల్మాన్ ఖురేషి తెలిపారు. దేశవ్యాప్తంగా 25 శాఖలు, 96 పార్ట్నర్ ఆఫీసులు ఉన్నట్లు వివరించారు. మరోవైపు, నేరుగా మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి ఫండ్స్ కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించేలా గతేడాది ప్రారంభించిన ’కాయిన్’ ప్లాట్‌ఫాం ద్వారా ఇప్పటిదాకా రూ.1,100 కోట్ల మేర పెట్టుబడులు జరిగాయని కార్తీక్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. పాతికేళ్లలో రూ.28 లక్షల దాకా కమీషన్లను ఆదా చేసుకున్నట్లవుతుందని ఆయన తెలిపారు. -
పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు
* నగదు మార్కెట్లో క్షీణిస్తున్న లావాదేవీలు * ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణం సాక్షి ప్రత్యేక ప్రతినిధి,హైదరాబాద్: ధమాకా దీపావళి వచ్చేసింది. మూరత్ ట్రేడింగ్‌తో కొత్త సంవత్సరం ఖాతాలు తెరుచుకుంటున్నాయ్. గతేడాదితో పోలిస్తే..కొన్ని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు రాకెట్లా దూసుకుపోతోంది. గత నాలుగైదునెలలుగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి వ్యాపార పరిమాణం పెరుగుతోంది. పది లక్షల కొత్తఇన్వెస్టర్ అకౌంట్లు రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలయిన ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్లలో ఈ ఏడాది నమోదయ్యాయి.అయితే అదేం విచిత్రమోకానీ, ఒక వైపు బ్రోకింగ్ బిజినెస్ పెరుగుతున్నా, ఎంతో కాలంగా ఈ వ్యాపారంలో స్థిరపడ్డ బ్రోకర్లు వైదొలగుతుండటం ఆందోళనకలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో 335 మంది వ్యక్తిగత స్టాక్ బ్రోకర్లు, 136 కార్పొరేట్ బ్రోకర్లు, 5,773 మంది సబ్‌బ్రోకర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలిగారు. రిటైల్ ఇన్వెస్టర్ లావాదేవీలు ఆశించినంతగా లేకపోవడం, తక్కువ మార్జిన్లుండే ఆప్షన్ల వ్యాపారంపై డే ట్రేడర్లు ఆసక్తి చూపించడం, పెరిగిపోతున్న నిర్వహణా వ్యయాలను తట్టుకోలేకపోవడంతో బ్రోకర్లు వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాష్ మార్కెట్లో మందకొడి లావాదేవీలు... మార్కెట్లో 90 శాతం వ్యాపారం కేవలం 10 మంది టాప్ బ్రోకర్ల చేతిలో ఉందని, షేర్ల లావాదేవీల్లో 90 శాతం వ్యాపారం కేవలం ఆప్షన్స్ సెగ్మెంట్లో జరుగుతుందని ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మురళి తెలిపారు.గతంలో లాగా షేర్లు కొని డెలివరీ తీసుకునేవారు బాగా తగ్గిపోయారన్నారు. బ్రోకరేజీతో పాటు, సెక్యూరిటీ ట్రేడ్ టాక్స్ (ఎస్టీటీ), సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ లాంటి వ్యయాలతో పాటు ఒకే ఏడాది వ్యవధిలో షేర్లు కొని అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ లావాదేవీ పరిమాణంలో 15 శాతం చెల్లించాల్సిరావడంతో క్యాష్ మార్కెట్లో లావాదేవీలు గ ణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో మంచి ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోందని, బ్రోకరేజ్ సంస్థలు ట్రేడర్ను బట్టి మార్జిన్లలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారన్నారు. ఒక్కో ట్రేడర్ జరిపే లావాదేవీల పరిమాణంబట్టి అతి తక్కువ బ్రోకరేజ్కూడా ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధపడుతున్నాయన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించాలి... స్టాక్మార్కెట్లో లావాదేవీలు జరిపే క్లయంట్లకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ప్రశాంత్ శ్రీమాలి, ఎండీ, పీసీఎస్ సెక్యూరిటీస్ తెలిపారు. తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినంత మాత్రాన అందరూ ఆన్లైన్ లావాదేవీలు జరపలేరని, సాంప్రదాయబద్ధంగా షేర్ మార్కెట్ బిజినెస్‌చేసే వారు బ్రోకరేజ్ సంస్థలకు దూరం కాలేరని ఆయన చెప్పారు. గత ఏడెనిమిది దశాబ్దాలుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడు కూడా తమ వ్యాపారంలో 50 శాతం ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుండగా మిగతా సగం బ్రోకర్ ఇంటరాక్షన్‌తోనే జరుగుతుందన్నారు. రానున్న అడ్వైజరీ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అందిస్తే ఈ వ్యాపారంలో ఎంతకాలమైనా కొనసాగవచ్చన్నారు. అమెరికాలోలా ఇండియాలో ఫుల్సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అనే విధానంలేదని, ఇక్కడున్నదల్లా డిస్కౌంట్బ్రోకరే జ్ సంస్థలేని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వివికే ప్రసాద్ సాక్షి ప్రతినిధికి తెలిపారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్‌బ్రోకింగ్ సంస్థలు హైస్పీడ్ ట్రేడింగ్‌కు అనుగుణంగా సేవలందించేందుకు ముంబైలో కోలొకేషన్ సర్వర్లను ఏర్పాటుచేసుకోలేకపోవడంతోనే ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. ఒక్కో కోలొకేషన్ సర్వర్‌కు రూ. కోటి రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పాటు ముంబైలో కార్యాలయం నిర్వహించాలంటే అయ్యే ఖర్చులు అదనం కావడంతో పోటీలో నిలవలేని సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చౌక ధరలే ఆకర్షణ... ఆన్లైన్ ట్రేడింగ్ పుంజుకోవడంతో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుండి స్టాక్స్ కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ కొనుగోలు చేయాలంటే గతంలో వంద రూపాయలు బ్రోకరేజ్ చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు ఒక లాట్ ఆప్షన్స్ బ్రోకరేజీ రూ. 10-20కి పడిపోయింది. దీంతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే బ్రోకరేజీ సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయని జాజూ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజయ్‌జాజూ చెప్పారు. -
బ్రోకింగ్ సంస్థలకు గడ్డుకాలం.. !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఇండియాలో ట్రేడర్లు స్టాక్ మార్కెట్ పేరు చెపితేనే.. ఆమడ దూరం పరుగులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయికి కూతవేటు దూరంలో ఉన్నా రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో వ్యాపారం లేక కొన్ని బ్రోకింగ్ సంస్థలు దుకాణాలను మూసుకుంటుంటే మరికొన్ని సంస్థలు ఇతర ఆదాయాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే హెచ్ఎస్బీసీ, బ్రిక్ సెక్యూరిటీస్ రిటైల్ బ్రోకింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించగా క్యాపిటల్ ఫస్ట్ కూడా అదే దారిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని పెద్ద సంస్థలు మాత్రం వ్యాపార విస్తరణకు పూర్తిగా స్వస్తి చెప్పడమే కాకుండా సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రోకింగ్ వ్యాపారం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని కార్వీ గ్రూపు చైర్మన్ సి.పార్థసారథి తెలిపారు. దీంతో గత కొంతకాలంగా సిబ్బంది సంఖ్యను కుదించినట్లు తెలిపారు. ‘‘2000 సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య రెండు కోట్లపైన ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 75 లక్షలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థేనని, ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే తిరిగి పుంజుకుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని’’ జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. మార్జిన్లపై ఒత్తిడి..: స్టాక్ మార్కెట్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటుండటంతో బ్రోకింగ్ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. ఇండియా ఇన్ఫోలైన్ ఈ ఏడాది తొలి త్రైమాసికం బ్రోకింగ్ ఆదాయం.. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% క్షీణించి రూ.128 కోట్లకు పడిపోయింది. బ్రోకింగ్ సంస్థలకు అధికాదాయం వచ్చే క్యాష్ సెగ్మెంట్లో లావాదేవీలు తగ్గి ట్రేడింగ్ పరిమాణం బాగా పెరగడం కూడా మార్జిన్లపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న టర్నోవర్‌లో 90% ట్రేడింగ్ వాటా ఉంటే క్యాష్ సెగ్మెంట్ 10%కి పడిపోయింది. అలాగే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో సగటు ట్రేడింగ్ మార్జిన్ విలువ గత మూడేల్లో 17 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్లకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సగటు లావాదేవీపై బ్రోకింగ్ సంస్థకు 7-8 డాలర్లు ఆదాయంగా వస్తుంటే, ఇక్కడ ఇది అర డాలర్‌కు మించకపోవడం కూడా హెచ్ఎస్బీసీ వంటి విదేశీ సంస్థలు ఈ వ్యాపారం నుంచి వైదొలగడానికి ఒక కారణమనేది మార్కెట్ వర్గాల వాదన. ఎన్బీఎఫ్సీలవైపు చూపు బ్రోకింగ్ వ్యాపారం దెబ్బతినడంతో ఆదాయం కోసం ఇతర వ్యాపారాలపై బ్రోకింగ్ సంస్థలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. 2007లో మొత్తం వ్యాపారంలో 80% బ్రోకింగ్ నుంచే వస్తే ఇప్పుడది 20-30%కి పడిపోయినట్లు ఈ కంపెనీల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ సంస్థలన్నీ రుణాలు, ఫీజు ఆధారిత ఇతర వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇండియా ఇన్ఫోలైన్ ఇచ్చిన రుణాల విలువ 29% పెరిగి రూ.9,463 కోట్లకు చేరుకుంటే, ఎడల్వీస్ రుణాలు 30% పెరిగి రూ.6,623 కోట్లకు పెరిగాయి. మన రాష్ట్రానికి చెందిన కార్వీ సంస్థ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు ఈ మధ్యనే బీమా రిపాజిటరీ సర్వీసుల్లోకి ప్రవేశించగా, జెన్ సెక్యూరిటీస్ కూడా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది.