హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)లో అవకతవకల కేసుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణలో సంస్థ డైరెక్టరు మేకా యుగంధర్‌కు ఊరట లబించింది. క్లయింట్ల నిధుల దుర్వినియోగం విషయంలో ఆయన ప్రమేయమేమీ లేదని తుది ఉత్తర్వుల్లో సెబీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆయన కేఎస్‌బీఎల్ మేనేజ్‌మెంట్‌తో కుమ్మక్కయ్యారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది.
ఆధారాలను బట్టి చూస్తే సంస్థలో యుగంధర్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాత్రమే ఉన్నారని, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఆయన జోక్యం లేదని తెలిపింది. వాస్తవానికి 2017లోనే క్లయింట్ల నిధుల దుర్వినియోగ అంశం గురించి ఆయన లేవనెత్తి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరినప్పటికీ సంస్థ సీఎఫ్‌వో, మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో యుగంధర్ ప్రజావేగుగానే వ్యవహరించారని, ఆయన్ను నేరస్తుడిగా భావించడానికి లేదని సెబీ పేర్కొంది. ఈ కేసులో కేఎస్‌బీఎల్, దాని ప్రమోటరు ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment