Yugandhar
-
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
కార్వీ కేసులో డైరెక్టర్ యుగంధర్‌కు ఊరట
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)లో అవకతవకల కేసుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణలో సంస్థ డైరెక్టరు మేకా యుగంధర్‌కు ఊరట లబించింది. క్లయింట్ల నిధుల దుర్వినియోగం విషయంలో ఆయన ప్రమేయమేమీ లేదని తుది ఉత్తర్వుల్లో సెబీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆయన కేఎస్‌బీఎల్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయ్యారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఆధారాలను బట్టి చూస్తే సంస్థలో యుగంధర్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా మాత్రమే ఉన్నారని, కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఆయన జోక్యం లేదని తెలిపింది. వాస్తవానికి 2017లోనే క్లయింట్ల నిధుల దుర్వినియోగ అంశం గురించి ఆయన లేవనెత్తి, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరినప్పటికీ సంస్థ సీఎఫ్‌వో, మేనేజ్మెంట్ పట్టించుకోలేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో యుగంధర్ ప్రజావేగుగానే వ్యవహరించారని, ఆయన్ను నేరస్తుడిగా భావించడానికి లేదని సెబీ పేర్కొంది. ఈ కేసులో కేఎస్‌బీఎల్, దాని ప్రమోటరు ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ
-
హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ
సాక్షి, హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కన్నుమూశారు. తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ళ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని నివాసానికి చేరుకున్నారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ 1962 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. 1983-85 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్ తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. బీఎన్ యుగంధర్ మరణంపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్.జగన్ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సత్య నాదెళ్ల తండ్రి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ (82) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. తండ్రి మరణవార్తను సత్య నాదెళ్లకు కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఆయన హైదరాబాద్ చేరుకున్నాక అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని, యుగంధర్ సమీప బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ చెప్పారు. 1962 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన యుగంధర్... 1983–85 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్ తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. కాగా, బీఎన్ యుగంధర్ మరణంపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్.జగన్ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య, యుగంధర్ మరణంపట్ల సంతాపం తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
సత్య నాదెళ్ల తండ్రి మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. యుగంధర్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల తండ్రి మృతి
-
సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ :మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్ సుదీర్ఘ కాలం సేవలు అందించారు. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పలు కీలక హోదాల్లో పని చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. కాగా బీఎన్ యుగంధర్ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. అయితే అనంతరం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక సత్యా నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు. -
సెంట్రల్ జైల్లో స్టూడెంట్ నెంబర్ 1
-
జీవిత ఖైదీకి డిగ్రీలో ‘గోల్డ్ మెడల్ ’
► నేడు అవార్డు అందుకోనున్న యుగంధర్ కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న గునకల యుగంధర్ (29) చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ పాసై గోల్డ్ మెడల్ అందుకోనున్నాడు. 2013–2015 సంవత్సరాల్లో బీఏలో ఈయన 1600 మార్కులకు 1147 మార్కులు సాధిం చి, టాప్‌లో నిలిచాడు. దీంతో యూ నివర్సిటీ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో సోమవారం నిర్వహించనున్న యూనివర్సిటీ 21 వ స్నాతకోత్సవంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్నాడు. హత్యకేసులో ముద్దాయిగా... యుగంధర్ది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం. తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే సంతానం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుకుంటుండగా ఓ హత్య కేసులో ముద్దాయి అయ్యాడు. చిత్తూరు జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అదే సంవత్సరం ఇతనికి జీవిత ఖైదు విధించడంతో 2011లో కడప కేంద్ర కారాగారానికి శిక్ష అనుభవించేందుకు వచ్చాడు. ఇక్కడి కారాగార అధికారుల ప్రోత్సాహంతో 2013– 2015 సంవత్సరాల్లో ఓపెన్‌గా బీఏ డిగ్రీలో చేరాడు. పట్టుదలతో చదవడంతో అత్యధిక మార్కులు సాధించి, గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యాడు. జైలు అధికారుల ప్రోత్సాహంతోనే తనకు మెడల్ వచ్చిందని ఖైదీ యుగంధర్ ఆదివారం విలేకరులకు తెలిపాడు. ఖైదీకి గోల్డ్ మెడల్ రావడంతో తోటి ఖైదీలు, జైలు అధికారులు అభినందిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. దీంతో తోటి కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగటంతో పట్టణంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైల్వేకోడూరుకు చెందిన యుగంధర్ స్థానిక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల నుంచి బైక్‌పై వస్తుండగా కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన యుగంధర్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మృతితో ఆగ్రహం చెందిన తోటి విద్యార్థులు బస్సు అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు. దీంతో కడప-రేణికుంట రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విద్యార్థులను నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. కాగా విద్యార్థి మృతితో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో వివేకానందరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి యుగంధర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
నాన్న నిర్ణయిస్తేనే.. పాలేరులో పోటీచేస్తా
తుమ్మల తనయుడు యుగంధర్ కోదాడ అర్బన్: తన తండ్రి నిర్ణయిస్తేనే.. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తెలిపారు. మంగళవారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుటుం బంలో తన తండ్రి మినహా వేరెవరూ ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరన్నారు. 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తుమ్మల యుగంధర్ తెలిపారు. -
సీఐడీ ఇన్స్పెక్టర్ అరెస్ట్
భార్య హత్య కేసులో నిందితుడు కర్నూలు : కర్నూలు సీఐడీ విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న యుగంధర్‌ను హత్యా నేరం కేసులో సోమవారం కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన యుగంధర్ అదే జిల్లాలోని కేశవపురం గ్రామానికి చెందిన సమీప బంధువు విశాలిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 2002లో పోలీస్ శాఖలో యుగంధర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, శ్రీశైలం, సంజామల, కోవెలకుంట్ల ప్రాంతాల్లో పని చేశారు. విశాలి పెళ్లికి ముందే ఓపన్ హార్ట్ సర్జరీ జరగడంతో సంతానం కలగలేదు. కోవెలకుంట్లలో ఎస్ఐగా పని చేసేటప్పుడు ఓ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగించారు. ఆమెతోనే కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తూ హోళగుందలో కాపురం పెట్టారు. ఈ విషయం భార్య విశాలికి తెలిసి భర్తతో గొడవ పడి కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పట్లో యుగంధర్‌పై కేసు కూడా నమోదైంది. కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తర్వాత భార్యతో రాజీ అయి కాపురం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీన ఆమె అనుమానాస్పద స్థితిలో వృతి చెందింది. కర్నూలులోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాత్రూంలో కాలు జారి పడి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో కోలుకోలేక వృతి చెందిందని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తన కూతురిని హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందంటూ బుకాయిస్తున్నాడని విశాలి తండ్రి నారాయణ, తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి యుగంధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విశాలిది హత్యేనని పోలీసుల విచారణలో బయట పడటంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో సోమవారం సాయంత్రం కర్నూలు హెడ్ పోస్టాఫీసు వద్ద యుగంధర్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీనివాసరావు ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. -
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
పెద్దముడియం/ముద్దనూరు, న్యూస్‌లైన్ : జమ్మలమడుగు నియోజకవర్గంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఓ ఘటన పెద్దముడియం మండలంలో జరగగా మరో ఘటన ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్దముడియం మండల పరిధిలోని జె.కొట్టాలపల్లెలో కూలి పనికి వచ్చిన 18 ఏళ్ల బాలికపై బాలవీరయ్య లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదు అందినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఎస్ఐ సమాచారం మేరకు ... ఇదే గ్రామానికి చెందిన బాలిక పత్తి చేనులోకి కూలి పనికి రావడంతో బాలవీరయ్య అనే వ్యక్తి ఆ బాలికపై లైంగికదాడి చేయగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు. వారొచ్చేలోపే నిందితుడు బాలవీరయ్య పరారు కావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసుతోపాటు 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ముద్దనూరులో.. ముద్దనూరులోని ఎస్వీ గిరి కాలనీకి చెంది న 15 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన ఊసోళ్ల హరికృష్ణ లైంగిక దాడి చేసాడని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. ఆయన సమాచారం మేరకు... శనివారం మధ్యాహ్నం ఆ కాలనీలో ఉన్న బాలికపై హరికృష్ణ లైం గిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ నరసింహమూర్తి హరికృష్ణపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
గీత స్మరణం
పల్లవి : నా పరువం నీకోసం... (2) పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ కోరిక పండగా నిండుగా... ॥పరువం॥ చరణం : 1 రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ ఈ సమయం నా హృదయం... (2) నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ ॥పరువం॥ చరణం : 2 ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా ఈ రోజూ ఇక రాదూ... (2) ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది ॥పరువం॥ చిత్రం : యుగంధర్ (1979) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.జానకి నిర్వహణ: నాగేశ్