
గీత స్మరణం
పల్లవి :
నా పరువం నీకోసం... (2)
పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా...
॥పరువం॥
చరణం : 1
రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ
ఈ సమయం నా హృదయం... (2)
నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ
॥పరువం॥
చరణం : 2
ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా
తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా
ఈ రోజూ ఇక రాదూ... (2)
ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది
॥పరువం॥
చిత్రం : యుగంధర్ (1979)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.జానకి
నిర్వహణ: నాగేశ్