
సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. యుగంధర్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.