సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం | Microsoft CEO Satya Nadella Father Yugandhar Passes Away | Sakshi
Sakshi News home page

సత్యా నాదెళ్లకు పితృ వియోగం

Published Fri, Sep 13 2019 6:51 PM | Last Updated on Fri, Sep 13 2019 7:50 PM

Microsoft CEO Satya Nadella Father Yugandhar Passes Away  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌ సుదీర్ఘ కాలం సేవలు అందించారు. 

పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పలు కీలక హోదాల్లో పని చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. కాగా బీఎన్‌ యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. అయితే అనంతరం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక సత్యా నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement