
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్’ పేరుతో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వన్‌స్టాప్ సొల్యూషన్‌ను ఆవిష్కరించింది. ఇందుకు ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను ప్రారంభించి నిర్వహించేందుకు ఎలాంటి ఫీజునూ వసూలు చేయరు. అయితే పేమెంట్ గేట్‌వే ఫీజులు అమలవుతాయి. వీటిని రిజిస్టర్ చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైలర్ల లావాదేవీలను పెంచే బాటలో ఆర్‌బీఐ తాజా చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిటైలర్లు ప్రభుత్వ బాండ్ల జారీ వివరాలను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment