government bonds
-
ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు..ఎందులో పెట్టుబడి పెట్టడం మంచిది
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లో ఒక వ్యక్తికి పెట్టుబడి ఉంది. అయితే మూడేళ్ల లాకిన్ పీరియడ్ నిండకుండానే అతడు మరణించాడు. దీంతో ఈఎల్ఎస్ఎస్ యూనిట్లను నామినీకి బదిలీ చేశారు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ పూర్తి కాకకపోయినా ఇప్పుడు నామినీ వాటిని విక్రయించుకోవచ్చా? – బుదేరియా అచ్చర్ దురదృష్టవశాత్తూ యూనిట్ హోల్డర్ మరణించినట్టయితే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. మరణించిన వ్యక్తి పెట్టుబడి పెట్టిన నాటి నుంచి ఏడాది పూర్తయిన తర్వాతే ఇందుకు అవకాశం ఇస్తారు. నామినీ లేదా వారసులు ఆ పెట్టుబడి కోసం మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు లాకిన్ పీరియడ్ అనేది ఉండదు. కానీ ఈఎల్ఎస్ఎస్ పథకాలకు మూడేళ్ల లాకిన్ ఉంటుంది. పెట్టుబడిదారుడికి కేటాయించిన తేదీ నుంచి మూడేళ్లు అమలవుతుంది. ఈ మూడేళ్ల తర్వాతే సదరు ఇన్వెస్టర్ తన పెట్టుబడిని వెనక్కి తీసుకోగలరు. యూనిట్ హోల్డర్ మరణించిన సందర్భాల్లో మాత్రం నామినీ లేదా చట్టబద్ధ వారసులు వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని ట్రాన్స్మిషన్ అని చెబుతారు. నామినీ లేదా వారసులకు యూనిట్లు బదిలీ అయిన వెంటనే వాటిని విక్రయించుకోవచ్చు. లేదా వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు. లేదా తనఖా కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 2021లో ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తత్వాత 2022లో మరణించాడని అనుకుంటే.. అప్పుడు నామినీ లేదా వారసులు తమ పేరిట సదరు యూనిట్లను మార్పించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. బదిలీ అయిన తర్వాత నుంచి ఏడాది ఆగక్కర్లేదు. మొదట పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఏడాది కాలం పూర్తయితే చాలు. ఎన్‌పీఎస్‌లో జీ సెక్యూరిటీలు (ప్రభుత్వ సెక్యూరిటీలు) కంటే కార్పొరేట్ ఫండ్ ఆప్షన్ అన్ని వేళలా మెరుగైనదేనా? ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు భద్రత ఉండే కార్పొరేట్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తారా? – జగన్నాథ్ గోస్వామి కార్పొరేట్ బాండ్ ప్లాన్లు సాధారణంగా మెరుగైన రాబడులు ఇస్తాయి. అయితే కార్పొరేట్ బాండ్ లేదా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎంపిక ఎప్పుడైనా కేవలం రాబడుల అంశం ఆధారంగా ఉండకూడదు. రిస్క్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూడాలి. పెట్టుబడుల క్రెడిట్ నాణ్యతను చూడాలి. మారుతున్న వడ్డీ రేట్లకు ఏ మేరకు ప్రభావితం అవుతాయనేది చూడాలి. నాణ్యత పరంగా చూస్తే ప్రభుత్వం బాండ్ ప్లాన్లు మెరుగైనవి. అవి సావరీన్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అవి అంతర్లీనంగా ప్రభుత్వ గ్యారంటీతో ఉంటాయి. కార్పొరేట్ బాండ్ ప్లాన్లు ఏఏఏ రేటెడ్, ఏఏప్లస్, ఏ1ప్లస్ రేటెడ్ బాండ్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. టర్మ్ డిపాజిట్లను సైతం ఎంపిక చేసుకుంటాయి. ఏఏఏ రేటెడ్ సాధనం అయినప్పటికీ, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో చెల్లింపుల్లో విఫలం కావచ్చు. అందుకుని పెట్టుబడికి భద్రత దృష్ట్యా కార్పొరేట్ ప్లాన్ల కంటే ప్రభుత్వ సెక్యూరిటీలే మెరుగైనవి. బాండ్లు అన్నవి మారే వడ్డీ రేట్ల ప్రభావానికి లోనవుతుంటాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్ల కాల వ్యవధి ఆధారంగా వడ్డీ రే ట్ల అస్థిరతల ప్రభావం ఉంటుంది. కార్పొరేట్ ప్లాన్ లో ఒక్కో బాండ్ సగటు కాల వ్యవధి ఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. ప్రభుత్వ ప్లాన్ అయితే కాల వ్యవధి సాధారణంగా పదేళ్లు ఉంటుంది. అందుకే వడ్డీ రేట్ల మార్పులకు ప్రభుత్వ ప్లాన్లు మరింత ఒత్తిడికి లోనయ్యే స్వభావంతో ఉంటాయి. దీర్ఘకాల సా ధనం కనుక ఈ అస్థిరతలకు ఆందోళన చెందక్క ర్లేదు. కనుక కార్పొరేట్ డెట్ ప్లాన్ అన్నివేళలా ప్రభు త్వ సెక్యూరిటీల కంటే మెరుగైనది అని చెప్పలేం. -
ప్రభుత్వ బాండ్లలో ‘రిటైల్’ పెంపుపై ఆర్బీఐ దృష్టి
ముంబై: ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రత్యేకంగా మార్కెట్ మేకింగ్ స్కీమ్‌ను నోటిఫై చేసింది. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకానికి వీలుగా రిటైల్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) ఖాతాదారులకు ధరలు/కోట్లను అందించడం ఈ స్కీమ్ లక్ష్యం. తాజా మార్కెట్ మేకింగ్ స్కీమ్ కింద ప్రైమరీ డీలర్స్ మార్కెట్ సమయాల్లో ఎన్డీఎస్–వోఎం ప్లాట్‌ఫామ్స్‌లో సెకండరీ మార్కెట్‌కు సంబంధించి రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాదారుల కొనుగోలు/అమ్మకం అభ్యర్థనలు, లావాదేవీల ప్రక్రియను సులభతరం చేస్తారు. రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద చేసిన ఆర్డీజీ ఖాతాదారుల నో యువర్ కస్టమర్ (కేవైసీ) ధృవీకరణపై ప్రాథమిక డీలర్లు ఆధారపడతారు.‘‘‘ఎన్డీఎస్–వోఎం రిక్వస్ట్ ఫర్ కోట్ ఖఊఖ విభాగంలో ఆర్డీజీ ఖాతాదారులతో లావాదేవీలు చేయడానికి తదుపరి కేవైసీ ధృవీకరణ అవసరం లేదు’’ అని ఆర్బీఐ స్పష్టం చేసింది. నేరుగా కొనుగోళ్లు... రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్ 12వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద వ్యక్తులు నేరుగా ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్) ప్రైమరీ, సెకండరీ మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యతను ఈ స్కీమ్ కల్పిస్తోంది. https:// rbiretaildirect. org. inలో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ఇందుకు వేదికగా ఉంది. ఈ స్కీమ్ కింద రిటైల్ ఇన్వెస్టర్లు (వ్యక్తిగతంగా) ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ అకౌంట్)ను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్లను ప్రత్యక్షంగా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానించవచ్చు. ఎన్డీఎస్–వోఎం సంగతి ఇదీ... స్క్రీన్ ఆధారిత ఎన్డీఎస్–వోఎం ద్వారా సెకండరీ మార్కెట్ ఆపరేషన్స్, ప్రభుత్వ సెక్యూరిటీల జారీ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వ్యక్తిగత ఆర్డీజీ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఎన్డీఎస్–వోఎం అనేది ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఉద్దేశించిన ఒక స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఆర్బీఐ నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకూ ఇది బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా), ఈమెయిల్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవని ఆర్బీఐ తెలిపింది. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేయించుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్‌మన్.. సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. -
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేయండిలా!
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ పేరుతో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వన్‌స్టాప్ సొల్యూషన్‌ను ఆవిష్కరించింది. ఇందుకు ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను ప్రారంభించి నిర్వహించేందుకు ఎలాంటి ఫీజునూ వసూలు చేయరు. అయితే పేమెంట్ గేట్‌వే ఫీజులు అమలవుతాయి. వీటిని రిజిస్టర్ చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైలర్ల లావాదేవీలను పెంచే బాటలో ఆర్బీఐ తాజా చర్యలు తీసుకుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిటైలర్లు ప్రభుత్వ బాండ్ల జారీ వివరాలను పొందవచ్చు. -
కరోనా: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా కలకలంతో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలమవుతోంది. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కీలక చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవ డానికి చర్యలు చేపట్టింది. ఓయంవో (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్)ద్వారా పది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనర్‌తో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్బిఐ తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆర్బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా కోవిడ్ -19 రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో కల్లోలకం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో ఆయా సెంట్రల్ బ్యాంకులన్నీ రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా యూఎస్ ఫెడ్ భారీగా రికార్డు స్థాయిలో రేట్ల కోతకు నిర్ణయించింది. ఇదే బాటలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ కూడా రేట్ల కోతకు దిగాయి. చదవండి : కరోనా : ఫేస్బుక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ఆరేళ్ల ప్రభుత్వ బాండ్లపై ఎన్ఎస్ఈ ఫ్యూచర్ కాంట్రాక్టులు
ఈ నెల 30 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ ఆరేళ్ల కాల వ్యవధిగల ప్రభుత్వ బాండ్లపై నూతన వడ్డీ రేటుతో కూడిన ఫ్యూచర్ (ఐఆర్ఎఫ్) కాంట్రాక్టులను ప్రవేశపెడుతోంది. ఈ నెల 30 నుంచి ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. 6.84 శాతం వడ్డీ రేటుతో కూడిన ఈ సెక్యూరిటీ 2022, డిసెంబర్ 19తో కాల పరిమితి తీరుతుంది. ఐఆర్ఎఫ్ అన్నది భవిష్యత్తులో కాల పరిమితి తీరే డెట్ ఇన్స్ట్రుమెంట్ను ముందుగానే ఓ ధరకు కొనడం, అమ్మడానికి వీలు కల్పించే కాంట్రాక్టు. ఆర్బీఐ పాలసీ, ద్రవ్య లభ్యత తదితర కారణాల వల్ల వడ్డీ రేట్లలో చోటు చేసుకునే ఆటు పోట్ల రిస్క్ నుంచి రక్షణ కోసం మార్కెట్ పార్టిసిపెంట్లు ఐఆర్ఎఫ్ను హెడ్జ్ సాధనంగా ఉపయోగించుకుంటుంటారు. రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ సంస్థలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.