ఆరేళ్ల ప్రభుత్వ బాండ్లపై ఎన్‌ఎస్‌ఈ ఫ్యూచర్ కాంట్రాక్టులు
ఈ నెల 30 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ ఆరేళ్ల కాల వ్యవధిగల ప్రభుత్వ బాండ్లపై నూతన వడ్డీ రేటుతో కూడిన ఫ్యూచర్ (ఐఆర్‌ఎఫ్) కాంట్రాక్టులను ప్రవేశపెడుతోంది. ఈ నెల 30 నుంచి ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. 6.84 శాతం వడ్డీ రేటుతో కూడిన ఈ సెక్యూరిటీ 2022, డిసెంబర్ 19తో కాల పరిమితి తీరుతుంది. ఐఆర్‌ఎఫ్ అన్నది భవిష్యత్తులో కాల పరిమితి తీరే డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌ను ముందుగానే ఓ ధరకు కొనడం, అమ్మడానికి వీలు కల్పించే కాంట్రాక్టు.
ఆర్‌బీఐ పాలసీ, ద్రవ్య లభ్యత తదితర కారణాల వల్ల వడ్డీ రేట్లలో చోటు చేసుకునే ఆటు పోట్ల రిస్క్ నుంచి రక్షణ కోసం మార్కెట్ పార్టిసిపెంట్లు ఐఆర్‌ఎఫ్‌ను హెడ్జ్ సాధనంగా ఉపయోగించుకుంటుంటారు. రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ సంస్థలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.