కరోనా: ఆర్‌బీఐ కీలక నిర్ణయం | RBI announces fresh OMO purchase of govt securities | Sakshi
Sakshi News home page

కరోనా: ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Published Wed, Mar 18 2020 4:07 PM | Last Updated on Wed, Mar 18 2020 4:53 PM

 RBI announces fresh OMO purchase of govt securities - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా కలకలంతో  కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19  మహమ్మారి విజృంభణతో ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలమవుతోంది.  దీంతో ఆయా దేశాల  కేంద్ర బ్యాంకులు కీలక చర్యలకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవ డానికి చర్యలు చేపట్టింది.  ఓయంవో (ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌)ద్వారా  పది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనర్‌తో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్‌బిఐ తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆర్‌బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది.

కాగా కోవిడ్‌ -19 రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో కల్లోలకం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో ఆయా సెంట్రల్ బ్యాంకులన్నీ రేట్ల కోతకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా యూఎస్ ఫెడ్  భారీగా రికార్డు స్థాయిలో రేట్ల కోతకు నిర్ణయించింది. ఇదే బాటలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ కూడా రేట్ల కోతకు దిగాయి. 

చదవండి :  కరోనా  : ఫేస్‌బుక్ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement