దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.56 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్‌ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్‌లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment