![India and Iran Made Discussion on Trading with Rupee Instead of Dollar - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/10/Modi.jpg.webp?itok=6nOfkLL0)
ముంబై: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి.
మూడు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ అమిర్–అబ్దుల్లాహియాన్ ఈ విషయాలు తెలిపారు. భారత్ తోడ్పాటుతో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టు లో పెట్టుబడులను పెంచే అంశం కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పటికీ భారత్, ఇరాన్‌లకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హొసేన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment