ట్రేడింగ్ టిప్స్‌తో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: షేర్లకు సంబంధించి అవాంఛిత ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి నష్టపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... ప్రజలకు సూచించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్‌అనలిస్ట్‌ల సలహాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ... ఆయా సంస్థల, వ్యక్తుల వివరాలు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
తమ వద్ద నమోదు కాని సంస్థలు.. ఇన్వెస్టర్లనుతప్పుదోవ పట్టించేలా ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఇలాంటి 15 సంస్థలపై చర్యలు తీసుకున్నామని సెబీ తెలిపింది. మనీవరల్డ్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ, గ్లోబల్ మౌంట్ మనీరీసెర్చ్ అండ్ అడ్వైజరీ, ఆరంజ్ రిచ్ ఫైనాన్షియల్స్, గోక్యాపిటల్, క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌లు తమ వద్ద నమోదు కాకుండానే ఇన్వెస్ట్‌మెంట్ సలహాలిచ్చాయని సెబీ పేర్కొంది