సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో రూ.59 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మార్చి 26, 2018న ఆర్‌బీఐ ఒక నోటీసు జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించినందుకు బ్యాంకుపై ఈ పెనాల్టీ విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ చర్య బ్యాంక్ వినియోదారులను ప్రభావితం చేయదని తెలిపింది.
ఆర్‌బీఐ హెచ్‌టీఎమ్ పోర్ట్ ఫోలియో నుంచి నేరుగా సెక్యూరిటీల అమ్మకాలపై ఐసీఐసీఐ బ్యాంకునకు రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. ఈ కేటగిరి కింద మొత్తం పెట్టుబడులు బ్యాంకు మొత్తం పెట్టుబడిలో 24శాతాన్ని మించకూడదు. కాగా ఇటీవల వివిధ నిబంధనల ఉల్లంఘనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment