సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని భూముల అక్రమాల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాజధాని భూముల విషయంలో భారిఎత్తున అక్రమాలు జరియాన్న ఆరోపణల నేపథ్యంలో.. దాన్ని నిగ్గు తేల్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమేనని సబ్‌కమిటీ నివేదించింది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. బినామీల పేర్లతో అక్రమాలు చేశారంటూ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది.
సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ, సిట్ విచారణ జరిపింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రాజధాని భూముల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని కేంద్ర హోం శాఖకు అంద చేశారు. మొత్తంగా నాలుగువేల ఎకరాలకు పైగా భూముల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని కెబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment