Quarter results
-
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
ఆదాయ వృద్ధిని పరిమితం చేసిన ఐటీ దిగ్గజం
అంతర్జాతీయ అనిశ్చితులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, బ్యాంకింగ్ వంటి ప్రధాన రంగాల్లోని సంస్థలు టెక్నాలజీ ఆధారిత సేవలపై చేసే ఖర్చును తగ్గించుకోవడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని కొన్ని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తదితర కంపెనీల షేర్లు ఇటీవల 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించింది. యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అమెరికా కంపెనీ తాజా నిర్ణయంతో దేశీయ ఐటీ కంపెనీల్లోనూ అదే ధోరణి ఉంటుందని మార్కెట్ భావిస్తున్నట్లు తెలిసింది. పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ యాక్సెంచర్ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
పాలీక్యాబ్ లాభం రూ.416 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 15 శాతం వృద్ధితో రూ.416 కోట్లకు చేరింది. త్రైమాసిక వారీ లాభంలో ఇది మూడో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. పన్ను అనంతర లాభాల మార్జిన్ 9.6 శాతంగా ఉంది. ఆదాయం 17 శాతం పెరిగి రూ.4,340 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.361 కోట్లు, ఆదాయం రూ.3,715 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 18 శాతం పెరిగి రూ.3,865 కోట్లకు చేరాయి. వైర్లు, కేబుళ్ల విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,904 కోట్లుగా ఉంది. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అమ్మకాల ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.296 కోట్లుగా ఉంది. ఈపీసీ విభాగం ఆదాయం రెట్టింపై రూ.247 కోట్లకు చేరింది. గత నెల కంపెనీకి చెందిన పలు ప్రాంగణాలు, ప్లాంట్లు, కొందరు ఉద్యోగుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ సమయంలో పూర్తి సహకారం అందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆదాయపన్ను శాఖ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. బీఎస్ఈలో పాలీక్యాబ్ షేరు పెద్దగా మార్పు లేకుండా రూ.4,431 వద్ద క్లోజ్ అయింది. -
ప్రపంచ పరిణామాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ప్రపంచ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టబడుల సరళీపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ఈ కొత్త ఏడాది 2024 తొలి వారంలో జరిగిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో సూచీలు మూడింటిలో లాభాలు ఆర్జించగా, రెండింటిలో నష్టాలు చవిచూశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 214 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయాయి. ‘‘దేశీయ కార్పొరేట్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన నేపథ్యంలో మార్కెట్ పరిమిత శ్రేణి ట్రేడవుతూ, ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. స్థిరమైన ర్యాలీ కొనసాగితే అమ్మకం, అనూహ్యంగా పతనమైతే నాణ్యమైన షేర్ల కొనుగోళ్లు వ్యూహాన్ని అమలు చేయడం ఉత్తమం. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 21,750 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 22,000 స్థాయిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 21,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మూడో త్రైమాసిక కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ ఈ వారం ప్రారంభం కానుంది. దేశీయ ఐటీ అగ్రగామి సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు గురువారం( జనవరి 11న) ఆర్థిక ఫలితాలను ప్రకటించి దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. మరుసటి రోజు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆనంద్ రాఠి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ నవంబర్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక సేవల గణాంకాలు సోమవారం విడుదల అవుతాయి. జపాన్ నవంబర్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ నవంబర్ నిరుద్యోగ రేటు, అమెరికా నవంబర్ వాణిజ్య లోటు గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. అమెరికా నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం ప్రకటించనుంది. ఇక వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ నవంబర్ రిటైల్, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదే రోజున జనవరి 5తో ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 29తో ముగిసిన వారం బ్యాంకింగ్ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులతో ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. అమెరికా బాండ్లపై రాబడులు గతవారం రోజుల్లో 18 బేసిస్ పాయింట్లు పెరిగి 4 శాతానికి పైగా చేరుకున్నాయి. యూఎస్ డిసెంబర్ పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. 5 ట్రేడింగ్ సెషన్లల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు కొత్త ఏడాది తొలివారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు జనవరి 1–5 తేదీల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారతీయ బలమైన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డెట్ మార్కెట్లో అదనంగా మరో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ డేటా వెల్లడించింది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో (జనవరి 1–5 తేదీల్లో) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,296 కోట్ల ఈక్విటీలు విక్రయించారు. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డెట్ మార్కెట్లో రూ.68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
పేటీఎం నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్‌గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. ఈసాప్ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్ ఈవెన్) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. -
WhatsApp leak case: యాక్సిస్ బ్యాంక్ ఇన్సైడర్ కేసులో ఆరోపణల కొట్టివేత
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఆర్థిక ఫలితాలకు సంబంధించి బయటకు వెల్లడి కాని సున్నిత సమాచారాన్ని వాట్సాప్ సందేశాల ద్వారా పంపిణీ చేసినట్టు 11 సంస్థలు, వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను సెబీ కొట్టివేసింది. 2017 సంవత్సరం జూన్ క్వార్టర్ ఫలితాలను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడానికి ముందే ఆ సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు సెబీ తన దర్యాప్తులో లోగడ గుర్తించింది. మల్బారి, వకీల్, మోతివాలా, ఖన్నా దేధియా యాక్సిస్ బ్యాంక్ ఫలితాల సమాచారాన్ని లీక్ చేశారంటూ, వీరిని ఇన్సైడర్లుగా ప్రకటించింది. కోటక్ క్యాపిటల్, హింగ్లాజ్, మెహ్రా, బగ్రేచా, షా, సల్దాన్హ సున్నిత సమాచారం ఆధారంగా యాక్సిస్ బ్యాంకులో ట్రేడింగ్ చేసినట్టు ఆరోపించింది. గతేడాది కూడా సెబీ టీసీఎస్, అల్ట్రాటెక్ తదితర 12 కంపెనీలకు సంబంధించి బయటకు వెల్లడించని సున్నిత సమాచారాన్ని లీక్ చేశారంటూ ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిస్థితుల్లో యాక్సిస్ బ్యాంకు సున్నిత సమాచారం కేసులో 11 మంది సంస్థలు, వ్యక్తులపై చేసిన ఆరోపణలు నిలబడవంటూ, వాటిని ఉపసంహరిస్తున్నట్టు సెబీ తాజాగా ప్రకటించింది. -
ఐటీ స్టాక్స్ జోరు, లాభాల్లో ఎల్అండ్టీ టెక్నాలజీ షేర్లు
ముంబై: ఎల్అండ్టీ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. కంపెనీ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.117 కోట్ల నుంచి రూ.216 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.1,562 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 17.3 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి 2021–22లో 15–17 శాతం మధ్య ఉండొచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. ‘‘యూఎస్, యూరోప్‌లో (ఈ రెండు ప్రాంతాల నుంచి 80 శాతం ఆదాయం) దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జపాన్, భారత్‌లోనూ సాధారణ పరిస్థితులు ఏర్పడనున్నాయి’’ అని కంపెనీ సీఈవో, ఎండీ అమిత్చద్దా తెలిపారు. బీఎస్ఈలో కంపెనీ షేరు 3 శాతం లాభపడి రూ.2,910 వద్ద క్లోజయింది. చదవండి : వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
టాటాలకు ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ(నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్) ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వు్యలను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు టాటా సన్స్ పిటిషన్ లిస్టయ్యింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీసీఎస్‌కు కూడా... కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కంపెనీ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 17న కంపెనీ ఫలితాలు.. కాగా, టీసీఎస్ శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ, జనవరి 17న డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నట్లు వివరించింది. -
మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. ఆదాయం రూ.7,125 కోట్ల నుంచి రూ.6,191 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 19% క్షీణించి రూ.1,357 కోట్లకు తగ్గింది మిశ్రమంగా రుణ నాణ్యత బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. గత క్యూ3లో 24.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 29.67 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచామని, గత క్యూ3లో రూ.3,650 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.5,075 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తాజా మొండి బకాయిలు మాత్రం ఏడు క్వార్టర్ల కనిష్ట స్థాయికి, రూ.2,211 కోట్లకు తగ్గాయని తెలిపింది. గత క్యూ3లో రూ.537 కోట్లుగా ఉన్న రికవరీలు ఈ క్యూ3లో రూ.3,440 కోట్లకు పెరిగాయి. కాగా, బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 4 శాతం నష్టపోయి రూ.50.65 వద్ద ముగిసింది. పేరు మార్పు ప్రతిపాదన ఐడీబీఐ బ్యాంక్ పేరును మార్చాలని ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్ ప్రతిపాదించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ బ్యాంక్‌ను టేకోవర్ చేసినందున (51% వాటా కొనుగోలు) బ్యాంక్ పేరును ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌గా గానీ, లేదా ఎల్ఐసీ బ్యాంక్‌గా గానీ మార్చాలని బోర్డ్ ప్రతిపాదించింది. -
ఎస్బీఐ షాకింగ్ : క్యూ1లో భారీ నష్టాలు
-
ఎస్బీఐ షాకింగ్ : క్యూ1లో భారీ నష్టాలు
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ షాకింగ్ ఫలితాలను విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,876 కోట్ల స్టాండలోన్ నికర నష్టాలను నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ రూ.242 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. కానీ విశ్లేషకుల అంచనాలను ఎస్బీఐ తలకిందులు చేసింది. గత మార్చి త్రైమాసికంలో కూడా ఇదే విధంగా రూ.7718.17 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ త్రైమాసికంలో బ్యాంక్‌కు రూ.2,005.53 కోట్ల లాభాలు ఉన్నాయి. ఏడాది ఏడాదికి ప్రొవిజన్లు భారీగా రూ.19,228.26 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ప్రొవిజన్లు రూ.8,929.48 కోట్లగా మాత్రమే ఉన్నాయి. అయితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు ఈ త్రైమాసికం మొత్తం రుణాల్లో 10.69 శాతానికి పడిపోయాయి. మార్చి త్రైమాసికంలో ఇది 10.91 శాతంగా రికార్డయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 5.73 శాతం నుంచి 5.29 శాతానికి తగ్గాయి. వడ్డీలు ఈ త్రైమాసికంలో 7.1 శాతానికి పెరిగి రూ.58,813.18 కోట్లగా రికార్డైనట్టు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల ప్రకటన అనంతరం ఈ బ్యాంక్ షేర్లు 5.1 శాతం క్షీణించాయి. -
భారీగా పడిపోయిన జెట్ ఎయిర్వేస్ షేర్
ముంబై : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షేరు భారీగా పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో జెట్ ఎయిర్వేస్ షేరు 14.5 శాతం మేర కిందకి దిగ జారింది. ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. తొలి క్వార్టర్ ఫలితాలను కంపెనీ వాయిదా వేయడంతో, షేర్ ధర తీవ్ర ఒడిదుడుకులు పాలవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడానికి ఆ కంపెనీ ఆడిటర్లు ఆమోదం తెలుపలేదు. కొన్ని విషయాల మూసివేత కారణంతో ఆడిట్ కమిటీ, కంపెనీ బోర్డుకు ఫలితాల ప్రకటన గురించి ఎలాంటి ఆమోదం పంపించలేదు. దీంతో కంపెనీ ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే గత ముగింపుకు 6.53 శాతం నష్టంలో జెట్ ఎయిర్వేస్ షేరు ఎంట్రీ ఇచ్చింది. ఆ అనంతరం మరింత కిందకి పడిపోతూ వస్తోంది. జెట్ ఎయిర్వేస్ షేరు ఇంతలా పడిపోతూ ఉంటే.. దీని ప్రత్యర్థి కంపెనీలు ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్, స్పైస్‌జెట్‌లు 1.7 శాతం, 2.2 శాతం పైకి ఎగుస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఫలితాలపై ఇప్పటికే విశ్లేషకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఎలరా క్యాపిటల్ అంచనాల ప్రకారం జెట్ ఎయిర్వేస్ రూ.490 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఈ సారి ఏవియేషన్ సెక్టార్ అవుట్‌లుక్ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండిగో తాను ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 97 శాతాన్ని కోల్పోయింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్ తన ఫలితాలను వచ్చే వారంలో ప్రకటించబోతుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి మరలింది. తొలుత ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత పెట్టాలని చూసింది. ఆ ప్రతిపాదనకు పైలెట్లు ఒప్పుకోకపోవడంతో, 500 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అంతేకాక తన క్యారియర్ వాటాను కొంతమేర విక్రయించేందుకు సాయపడాలని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సైతం జెట్ ఎయిర్వేస్ కోరింది. -
సీనియర్లను ఇంటికి పంపేస్తున్న కాగ్నిజెంట్
అంతర్జాతీయ ప్రముఖ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లను ఇంటికి పంపేస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగాలపై వేటు వేయాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది. సీనియర్లపై వేటు వేయాలని చూస్తున్న ఈ కంపెనీ, ఆ స్థానాల్లో మరింత మంది జూనియర్లకు చోటు కల్పించనున్నట్టు కూడా తెలిపింది. గురువారం ప్రకటించిన కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను కాగ్నిజెంట్ చేరుకోలేకపోయింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలోనే కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేసినట్టు పేర్కొంది. సీనియర్లను కాగ్నిజెంట్ టార్గెట్ చేసిందని, ఇది కేవలం వాలంటరీ మాత్రమే కాదని, ఇది మరింత ఇన్వాలంటరీ(బలవంతం పంపించేయడం) అని కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజ్ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సారి లేఆఫ్‌లో ఎంతమంది సీనియర్ స్థాయి ఉద్యోగులును టార్గెట్ చేశారో ఆయన బహిర్గతం చేయలేదు. ఇది గ్లోబల్ ప్రక్రియ అని, ప్రత్యేక ప్రాంతాన్ని, ప్రత్యేక దేశాన్ని తాము టార్గెట్ చేయలేదని మాత్రం చెప్పారు. కాగ, సీనియర్లపై వేటు వేస్తున్న ఈ కంపెనీ జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటుంది. మరింత మంది జూనియర్లకు తన కంపెనీలో చోటు కల్పిస్తోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటున్న ఈ కంపెనీకి, ఈ క్వార్టర్లో హెడ్‌కౌంట్ కూడా పెరిగింది. రెండో క్వార్టర్లో 7500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. మూడో క్వార్టర్లో జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లాగ్లిన్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్లో ఉంటాయన్నారు. ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టడానికి తమకు మంచి మార్జిన్లు నమోదవడం గుడ్‌న్యూస్ అని మెహతా చెప్పారు. ఈ రెండో క్వార్టర్లో కాగ్నిజెంట్ రెవెన్యూలు 4.01 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది నుంచి ఇవి 9.2 శాతం పెంపు. -
లాభాలే లాభాలు : ఇక జియో కస్టమర్లకు పండగే!
ముంబై : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు లాభాల పంట పండించింది. నేడు ప్రకటించిన తొలి క్వార్టర్ ఫలితాల్లో నికర లాభాలు రూ.9,459 కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.9,108 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ నుంచి కంపెనీకి వచ్చిన కన్సాలిడేటెడ్ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 56.5 శాతం పెరిగి, రూ.1.41 లక్షల కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. ఈ రెవెన్యూలు గతేడాది ఇదే సమయంలో రూ.90,537 కోట్లగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వరుసగా మూడు క్వార్టర్లు నికర లాభాలను ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మరికొంత కాలం పాటు కూడా టారిఫ్ ధరలు తగ్గనున్నట్టు తెలిసింది. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి టారిఫ్‌లను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్ ముగింపు నాటికి రిలయన్స్ జియో రూ.612 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.510 కోట్లగా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల్లో ముఖ్య విషయాలు.. కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్జిన్లు ఒక్కో బ్యారల్‌కు 10.5 డాలర్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఒక్కో బ్యారల్ గ్రాస్ రెవెన్యూ మార్జిన్ 11.90 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్లో జూన్ క్వార్టర్ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 42.9 శాతం పెరిగి రూ.95,646 కోట్లగా ఉన్నాయి. రిలయన్స్ జియో ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.134.50కి పడిపోయింది. జియో ఈబీఐటీడీఏలు క్వార్టర్ క్వార్టర్‌కు 16.80 శాతం పెరిగి రూ.3,147 కోట్లకు ఎగిశాయి. జియో ఈబీఐటీడీఏ మార్జిన్లు క్వార్టర్ క్వార్టర్ బేసిస్‌లో 37.80 శాతం నుంచి 38.80 శాతం పెరిగాయి. సబ్‌స్క్రైబర్ వృద్ధిలో జియో ట్రెండ్ కొనసాగుతోంది. నెట్ అడిక్షన్ 28.7 మిలియన్లగా నమోదైంది. కంపెనీ కమర్షియల్‌గా సర్వీసులు లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక అడిక్షన్. మా వ్యాపారాల పోర్టుఫోలియోలో కార్యాచరణ శ్రేష్టత ద్వారా బలమైన డెలివరీని అందించేందుకు దృష్టి సారిస్తూనే ఉంటాం. మా పెట్రోకెమికల్స్ వ్యాపారాలు రికార్డు ఈబీఐటీడీఏలను జనరేట్ చేశాయి. కాలానుగుణ బలహీనత ఉన్నప్పటికీ, రిఫైనింగ్ వ్యాపారాల ప్రదర్శన స్థిరంగా ఉంది. ఆయిల్ ఉత్పత్తుల్లో గ్లోబల్‌గా డిమాండ్ కొనసాగింది. మా రిఫైనింగ్ వ్యాపారాల్లో, సముద్ర ఇంధనాల్లో పర్యావరణానికి అనుకూలంగా కఠినమైన చర్యలను అమలు చేశాం - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ -
తొలిసారి : ఐసీఐసీఐ బ్యాంక్‌కి భారీ నష్టాలు
ముంబై : వీడియోకాన్ రుణ వివాదం... ఏకంగా బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌పైనే పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు... ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి క్వార్టర్ ఫలితాల్లో కూడా ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఏకంగా బ్యాంక్ రూ.119.55 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కనీసం ఏ మాత్రం లాభాలు లేకుండా.. నష్టాల్లో కూరుకుపోవడం, బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇదే మొదటిసారి. 1998లో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. గతేడాది ఇదే క్వార్టర్లో బ్యాంక్ లాభాలు రూ.2,049 కోట్లగా ఉన్నాయి. బ్యాంక్ ప్రొవిజన్లు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా పెరిగాయి. క్వార్టర్ రివ్యూలో ప్రొవిజన్లు రూ.128.86 శాతం పెరిగి రూ.5,971 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. క్వార్టర్ క్వార్టర్‌కు మాత్రం ఈ ప్రొవిజన్లు 10 శాతం తగ్గాయి. అయితే బ్యాంక్ కేవలం లాభాలను మాత్రమే పోగొట్టుకుంటుందని, లాభాలను 31 శాతం తగ్గించుకుని రూ.1422 కోట్ల నికర లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వీరి అంచనాలన్నింటిన్నీ ఐసీఐసీఐ బ్యాంక్ తలకిందులు చేసింది. ఏకంగా నష్టాలనే నమోదు చేసింది. అది పది, పదిహేను కోట్లు కాకుండా.. ఏకంగా రూ.120 కోట్ల మేర నికర నష్టాలను బ్యాంక్ ప్రకటించింది. అయితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. 2018 మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంక్ ఎన్పీఏలు 8.84 శాతం నుంచి 8.81 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 4.77 శాతం నుంచి 4.19 శాతానికి పడిపోయాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 9.16 శాతం పెరిగి రూ.6,102 కోట్లు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.5,590 కోట్లగా ఉన్నాయి. కాగ, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ లేకుండా.... ప్రకటించిన తొలి ఫలితాలు ఇవి. ప్రస్తుతం ఆమె వీడియోకాన్ రుణ వివాదం వల్ల, బ్యాంక్ స్వతంత్ర విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సెలవులో ఉన్నారు. బ్యాంక్ కొత్త సీఓఓగా సందీప్ భక్షిని నియమించారు. -
భారీగా పడిపోయిన భారతీ ఎయిర్టెల్
ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో భారతీ ఎయిర్టెల్ లాభాలు 74 శాతం క్షీణించి రూ.97.30 కోట్లగా రికార్డయ్యాయి. ఈ టెలికాం దిగ్గజం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.367.30 కోట్ల లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ క్వార్టర్లో భారతీ ఎయిర్టెల్ రూ.479 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలిసింది. కానీ నికర నష్టాల బాధ నుంచి ఎయిర్టెల్ తప్పించుకుంది. కానీ కంపెనీ లాభాలు మాత్రం భారీగానే దెబ్బకొట్టి, బాగా క్షీణించాయి. ఈ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూలు రూ.20,080 కోట్లకు పడిపోయాయని ప్రకటించింది. ఇవి గతేడాది ఇదే క్వార్టర్లో రూ.21,958.10 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. కానీ 2019 ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండలోన్ బేసిస్‌లో కంపెనీ రూ.1,457.20 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని తన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్వార్టర్లో 2,236 బిలియన్ ఎంబీగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. ఏడాది ఏడాదికి ఇది 328 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. ఆపరేషనల్ వైపు, ఈబీఐటీడీఏ లు సీక్వెన్షియల్‌గా 3 శాతం తగ్గి రూ.6,837 కోట్లగా ఉన్నాయి. దేశీయ వైర్లెస్ వ్యాపారాలు ఈ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా 1 శాతం పెరిగి రూ.10,480 కోట్లగా రికార్డయ్యాయి. ఒక్కో యూజర్ సగటు రెవెన్యూ జూన్ క్వార్టర్లో రూ.105గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్లో ఇది రూ.116గా ఉంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.63 శాతం పెరిగి రూ.357.60గా నమోదయ్యాయి. -
జియో ఎఫెక్ట్ : మళ్లీ పడిన వొడాఫోన్
టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో సంచలనంతో దిగ్గజాలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. దేశీయ రెండో అతిపెద్ద టెలికాం వొడాఫోన్ మరోసారి తన క్వార్టర్ ఫలితాల్లో కిందకి పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో వొడాఫోన్ రెవెన్యూలు 22.3 శాతం క్షీణించి 959 మిలియన్ యూరోలుగా(రూ.7706 కోట్లగా) రికార్డైనట్టు తెలిసింది. టర్మినేషన్ రేట్ల కోత, తీవ్రతరమవుతున్న పోటీ నేపథ్యంలో తన రెవెన్యూలను కోల్పోయినట్టు వొడాఫోన్ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో 1.387 బిలియన్ యూరోల రెవెన్యూలను ఈ కంపెనీ పోస్టు చేసింది. కాగ, రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఒకటిగా అతిపెద్ద దేశీయ టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. ఈ విలీనానికి టెలికాం డిపార్ట్మెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు వరకు తమ విలీనాన్ని పూర్తి చేస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే గత మార్చి క్వార్టర్‌తో పోలిస్తే, సర్వీసు రెవెన్యూలు కేవలం 0.2 శాతం మాత్రమే తగ్గాయని కంపెనీ చెప్పింది. ఈ మూడు నెలల కాలంలో ప్రీపెయిడ్ ధరలు స్థిరంగా కొనసాగించడంతో, కాస్త సర్వీసు రెవెన్యూల నష్టాలను తగ్గించుకోగలిగామని పేర్కొంది. పోస్టు పెయిడ్ కనెక్షన్లకు ఒక్కో యూజర్ సగటు రెవెన్యూ 20 శాతం పడిపోయిందని, ప్రీపెయిడ్ కనెక్షన్లకు 28 శాతం తగ్గిందని ఫైల్ చేసింది. 29 శాతానికి పైగా తమ ప్రీపెయిడ్ యూజర్లు అపరిమిత ఆఫర్లను పొందుతున్నారని, 77 మిలియన్ మంది డేటాను వాడుతుండగా.. వారిలో 20.9 మిలియన్ల మంది 4జీ ని కలిగి ఉన్నారని పేర్కొంది. భారత్‌లో డేటా ధరలు భారీగా తగ్గిపోవడంతో, కస్టమర్లు నెలకు సగటున 4.6జీబీ డేటా వాడుతున్నట్టు వొడాఫోన్ చెప్పింది. ఇదే యూరప్‌లో అయితే కేవలం 2.8 జీబీ మాత్రమేనని వెల్లడించింది. అయితే తక్కువ ధరల వద్ద హై-వాల్యు కస్టమర్లను కాపాడుకునే సత్తా తమకు ఉందని కంపెనీ చెప్పింది. -
అంచనాలు మించిన విప్రో
బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,121 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం, రూ.2,077 కోట్లతో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించినట్లు విప్రో తెలిపింది. మొత్తం లాభం రూ.2,083 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.2,094 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.13,626 కోట్ల నుంచి 3 శాతం పెరిగి రూ.13,978 కోట్లకు ఎగసింది. ఈ జూన్ క్వార్టర్లో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 5% వృద్ధితో రూ.13,700 కోట్లకు పెరిగిందని, డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం వృద్ధితో 203 కోట్ల డాలర్లకు చేరుకుందని విప్రో సీఈఓ అబిదాలి నీముచ్వాలా చెప్పారు. ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్లో 0.3– 2% రేంజ్లో వృద్ధి చెంది 200–205 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. అంచనాలు మించిన ఫలితాలు.. విప్రో జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఐటీ సేవల నిర్వహణ లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 24 శాతం వృద్ధితో రూ.2,397 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ 3.1 శాతం వృద్ధితో 17.5 శాతానికి చేరింది. నిర్వహణ లాభం రూ.2,169 కోట్లుగా, మార్జిన్ 16 శాతంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలను విప్రో అధిగమించింది. సరైన దారిలోనే విప్రో... అభివృద్ధి చెందిన మార్కెట్లలో ముఖ్యంగా ఉత్తర అమెరికా దేశాల్లో ఐటీపై కంపెనీలు చేస్తున్న వ్యయాలు పెరిగినట్లు నీముచ్వాలా చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా ఐటీ వ్యయాలు పెరిగాయని వివరించారు. డిజిటల్ విభాగంలో తాము పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డర్ల పరంగా ఈ క్వార్టర్ బాగా ఉందని, విప్రో సరైన దిశలోనే పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక మార్చి క్వార్టర్లో 1,63,827గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్ క్వార్టర్ నాటికి 1,64,659కు పెరిగిందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో విప్రో షేర్ 0.7 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 9 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఇతర ఐటీ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. టీసీఎస్ 47 శాతం, ఇన్ఫోసిస్ 27 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 11 శాతం చొప్పున లాభపడ్డాయి. -
భారీగా కుప్పకూలిన ఐడియా
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్ కంపెనీ మరోసారి భారీగా కుప్పకూలింది. కంపెనీ కన్సాలిడేట్ నికర నష్టాలు మూడింతలు మేర ఎగిశాయి. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.962.20 కోట్లగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర నష్టాలు రూ.327.70 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ ఏడాది ఐడియాకు నష్టాలు మరింతగా పెరిగాయి. క్వార్టర్ సమీక్షలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ఏడాదికి 22 శాతం తగ్గి రూ.6387.70 కోట్లగా రికార్డైంది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా 114 రూపాయల నుంచి 105 రూపాయలకు తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువ. జియో ఆర్పూ 137 రూపాయలుండగా.. భారతీ ఎయిర్టెల్ ఆర్పూ 116 రూపాయలుగా ఉంది. ఐడియా సెల్యులార్ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటీసీ సెటిల్మెంట్ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీకర వాతావరణ నేపథ్యంలో ఐడియా, వొడాఫోన్లు జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఈ ఏడాది ప్రథమార్థంలో ఒకటి కాబోతున్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఐడియా కంపెనీ స్టాక్ 0.66 శాతం పెరిగి రూ.68.80 వద్ద ముగిసింది. -
మారుతీ అంచనాలు మిస్, అయినా...
దేశీయ అతిపెద్ద కారు తయారీదారి మారుతీ సుజుకీ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. అయినప్పటికీ నేడు ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 10శాతం పైకి ఎగిశాయి. ఈ క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1,882 కోట్లగా నమోదయ్యాయి. విశ్లేషకుల ప్రకారం మారుతీ సుజుకీ రూ.2,087 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని అంచనాలు వెలువడ్డాయి. కానీ అంచనాల కంటే కాస్త తక్కువగా లాభాలను మారుతీ సుజుకీ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1,710.50 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో 2 శాతం పెరిగి రూ.21,760.60 కోట్లగా ఉంది. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ.80 డివిడెండ్ ప్రకటించింది. ఎక్కువ పన్ను రేటు తమ క్యూ4 ప్యాట్ గణాంకాలపై ప్రభావం చూపిందని, అంతేకాక మెటల్ వ్యయాలు కూడా ఈ ఏడాది రూ.700 కోట్లు పెరగడంతో లాభాలు కాస్త తగ్గినట్టు పేర్కొంది. తమ పాపులర్ కారుగా ‘మారుతీ 800’ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తంగా జనవరి-మార్చి క్వార్టర్లో కంపెనీ 4,61,773 వాహనాలు విక్రయించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఇవి 11.4 శాతం పెంపుగా వెల్లడించింది. దేశీయ మార్కెట్లో 4,27,082 యూనిట్లను విక్రయించినట్టు, విదేశాలకు 34,691 యూనిట్లు ఎగుమతి చేసినట్టు పేర్కొంది. -
రికార్డులు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు రూ.1000 మార్కును చేధించాయి. ఈ రోజు సాయంత్రం కంపెనీ తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్‌లో జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ షేరు 2.39 శాతం లాభంలో రూ.998.70 వద్ద కొనసాగుతోంది. కంపెనీ మార్చి క్వార్టర్లో రూ.9,635.2 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏడాది ఏడాదికి ఇది 19.8 శాతం పెంపుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రిలయన్స్ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న సంగతి తెలిసిందే. పెట్రో కెమికల్, రిఫైనరీ బిజినెస్‌లను మాత్రమే కాక, పెట్టుబడిదారులు టెలికాం రంగంపై కూడా ఎక్కువగా దృష్టిసారించారు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు 11.6 డాలర్ల నుంచి 11.3 డాలర్లకు పడిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్‌కు చెందిన జియో టెలికాం వ్యాపారాలు లాభాలను నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఏడాది కంపెనీ షేర్లు 34 శాతం ర్యాలీ జరిపాయి. నేడు వెల్లడించే ఫలితాల్లో ఈక్విటీ షేర్లపై డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించనుందని తెలుస్తోంది. -
రికార్డు సృష్టించిన ఫేస్బుక్
శాన్ఫ్రాన్సిస్కో : ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎదుర్కొంటున్న డేటా చోరి సంక్షోభం, తన ఫలితాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బుధవారం ప్రకటించిన తొలి క్వార్టర్ లాభాల్లో ఫేస్బుక్ ఆల్-టైమ్ హై స్థాయిని రికార్డు చేసింది. కంపెనీ నికర లాభాలు ఈ క్వార్టర్లో దాదాపు 65 శాతం మేర జంప్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 4.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదేవిధంగా రెన్యూలు 49 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చిన రెవెన్యూలు అగ్రస్థానంలో ఉన్నాయి. మార్చి నుంచి కొనసాగుతున్న ప్రైవసీ స్కాండల్‌తో ఫేస్బుక్ సతమతమవుతున్నా.. ఈ ఫలితాలు ఆ కంపెనీకి కాస్త ఊరట కలిగించాయి. గతేడాది కంటే కూడా ఈ ఏడాదే రోజుకు 13 శాతం ఎక్కువ మంది ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే ప్రస్తుతం నెలకొన్న డేటా స్కాండల్ ప్రభావం రెండో క్వార్టర్లో చూపించవచ్చని విశ్లేషకులంటున్నారు. యూజర్ల ప్రమేయం లేకుండా ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికాతో యూజర్ల డేటా పంచుకుందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఫేస్బుక్ డిలీట్ అనే ఉద్యమం నడుస్తోంది. ఇన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, తమకు 2018 ఏడాది చాలా బలంగా ప్రారంభమైందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. డేటా స్కాండల్‌పై పలు క్లాస్ యాక్షన్ దావాలను ఫేస్బుక్ ఎదుర్కొంటోంది. ఈ వివాదంతో స్టాక్ కూడా 14 శాతం కిందకి పడిపోయింది. అయితే బలమైన క్వార్టర్ ఫలితాలను ఫేస్బుక్ ప్రకటించడంతో ఫేస్బుక్ షేర్లు పుంజుకుని, 4 శాతానికి పైగా లాభాలు పండిస్తున్నాయి. -
అంచనాలు బీట్ చేయలేకపోయిన విప్రో
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం విప్రో స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఏడాది ఏడాదికి కన్సాలిడేట్ నికర లాభాల్లో విప్రో 21 శాతం క్షీణించింది. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో విప్రో నికర లాభం రూ.1,800.80 కోట్లగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో విప్రో లాభం రూ.2,267 కోట్లు. ఈటీనౌ పోల్ అంచనాల్లో విప్రో రూ.2,140 కోట్లు ఆర్జిస్తుందని అంచనావేశారు. కానీ ఈ అంచనాలను కూడా విప్రో అందుకోలేకపోయింది. సీక్వెన్షియల్ బేసిస్‌లో కంపెనీ లాభాలు 6.7 శాతం పడిపోయాయి. ఆపరేషన్స్ నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్లో రూ.13,768.6 కోట్లగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.13,987.5 కోట్లుగా రికార్డయ్యాయి. ఒక్కో షేరుపై వచ్చిన రెవెన్యూలు 4 రూపాయలుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. విప్రో ఎయిర్పోర్ట్ ఐటీ సర్వీసుల్లో కంపెనీ ఈక్విటీ హోల్డింగ్ 74 శాతం నుంచి 11 శాతానికి తగ్గించుకున్నట్టు పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.14,304.6 కోట్లగా ఉన్నట్టు వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.15,045.5 కోట్లగా ఉంది. మొత్తంగా ఇవి అంత మంచి ఫలితాలు కావని, కొన్ని కారణాల వల్ల తమ ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంతకమందే కంపెనీ సంకేతాలు ఇచ్చిన స్వతంత్ర మార్కెట్ విశ్లేషకుడు పంకజ్ శర్మ చెప్పారు. కానీ ఆ సవాళ్లను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఇవి అంతమంచి ఫలితాలు కావని పేర్కొన్నారు. రేపు విప్రో స్టాక్ కరెక్షన్ గురయ్యే అవకాశముందని, కనీసం 2 శాతం నుంచి 4 శాతం కిందకి పడిపోతుందని శర్మ అంచనావేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్
ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 20 శాతం జంప్ చేసి రూ.4799 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. కాగ గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3990 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్ ప్రకటించింది. 2 రూపాయల గల ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెంట్ ఇచ్చేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఇది షేర్ల ఫేస్ విలువకు 650 శాతం అధికం. గతేడాది ఇదే క్వార్టర్లో 11 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశంలో పెట్టుబడిదారులు దీన్ని ఆమోదించనున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.4,838 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. కానీ విశ్లేషకుల అంచనాలకు కాస్త దగ్గర్లోనే బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర ఆదాయాలు ఏడాది ఏడాదికి 17.7 శాతం పెరిగి రూ.10,657.71 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.30 శాతంగా ఉన్నాయి. అంతేకాక నికర ఎన్పీఏలు గత డిసెంబర్ క్వార్టర్లో 0.44 శాతంగా ఉంటే, ఈ మార్చి క్వార్టర్లో 0.40 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.98 శాతం పెరిగి, రూ.1,960.95 వద్ద ముగిశాయి. -
టీసీఎస్ లాభాలు జంప్
దేశీయ అతిపెద్ద టెక్నాలజీ సంస్థ టీసీఎస్ అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.6,904 కోట్లగా పేర్కొంది. ఏడాది ఏడాదికి ఇది 4.48శాతం పెంపుగా తెలిపింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ కంపెనీ రూ.6,812 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. కానీ అంచనాలను బీట్ చేసి టీసీఎస్ లాభాలను ఆర్జించింది. కంపెనీ గత క్వార్టర్లో రూ.6531 కోట్ల లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో గత మూడు క్వార్టర్ల నుంచి కంపెనీ ప్రతికూల లాభాల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చాయి. కానీ ఈ క్వార్టర్లో మెరుగైన లాభాలను ఆర్జించాయి. సీక్వెన్షియల్ బేసిస్‌లో ఈ ఐటీ దిగ్గజం లాభాల్లో 5.71 శాతం వృద్ధిని సాధించింది. ఆపరేషన్స్ నుంచి నికర ఆదాయాలు రూ.32,075 కోట్లగా నమోదైనట్టు టీసీఎస్ తెలిపింది. ఈబీఐటీ మార్జిన్లు ఈ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా 20 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ ఈక్విటీ షేర్లపై 1:1 బోనస్‌ను బోర్డు ఆమోదం తెలిపినట్టు ప్రకటించింది. అంటే షేర్‌హోల్డర్స్ ఒక్కో షేరుకు మరో షేరు బోనస్‌గా రానుంది. అంతేకాక ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.29 ఫైనల్ డివిడెంట్ను కూడా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని తెలిపింది. డాలర్ విలువల్లో టీసీఎస్ రెవెన్యూలు 4,972 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. అంటే ఏడాది ఏడాదికి ఇది 11.7 శాతం పెంపు అని పేర్కొంది. డాలర్ రెవెన్యూ వృద్ధిలో తాము రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్నట్టు తెలపడం చాలా ఆనందదాయకంగా ఉందని కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు. అన్ని పరిశ్రమల వ్యాప్తంగా డిజిటల్‌కు బలమైన డిమాండ్‌ను సాధించినట్టు తెలిపారు. ఇటీవల ఏడాదుల్లో తమకు నమోదైన మంచి క్వార్టర్స్‌లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. బలమైన వృద్ధితో పాత ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఎంతో విశ్వాసంతో అడుగుపెడుతున్నామని చెప్పారు. తమ కస్టమర్లకు వారి వ్యాపారాలను 4.0 జర్నీస్లోకి తీసుకెళ్తున్నారని, తాము కూడా వారి వృద్ధికి సహకరించడానికి డిజిటల్ టెక్నాలజీల ద్వారా సాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగ, గతవారం ఇన్ఫోసిస్ కూడా తన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ4లో ఆ కంపెనీ రూ.3,690 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రిపోర్టు చేసింది.