స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫలితాలు (ఫైల్ ఫోటో)
ముంబై : దేశంలో అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) షాకింగ్ ఫలితాలను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా 2017-18 డిసెంబర్ క్వార్టర్‌లో రూ.2,416.37 కోట్ల నికర నష్టాలను మూటకట్టుకున్నట్టు ప్రకటించింది. ముందటేడాది ఇదే క్వార్టర్‌లో ఈ బ్యాంకుకు నికర లాభాలు రూ.2,610 కోట్లు ఉన్నాయి. ప్రొవిజన్స్, కంటింజెన్సీస్ ఏడాది ఏడాదికి 111 శాతం పెరిగి రూ.18,876.21 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి కేవలం రూ.8,942.83 కోట్లగా మాత్రమే ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) కూడా క్యూ3లో రూ.1.99 లక్షల కోట్లకు పెరిగాయి. ఇవి 2016-17 క్యూ3లో రూ.1.08 లక్షల కోట్లగా ఉన్నాయి.
కేవలం నికర వడ్డీ ఆదాయాలు మాత్రమే బ్యాంకువి 26.88 శాతం పెరిగి, ఏడాది ఏడాదికి రూ.18,687.57 కోట్లగా రికార్డయ్యాయి. ఇతర ఆదాయలు 16.3 శాతం క్షీణించాయి. నికర ఎన్‌పీఏలు కూడా బ్యాంకుకు బాగానే పెరిగాయి. బ్యాంకు ఈ మేర నష్టాలు నమోదుచేయడానికి ప్రధాన కారణం భారీగా ప్రొవిజన్లు పెరగడం, అసెట్ క్వాలిటీ సీక్వెన్షియల్‌గా దెబ్బతినడమేనని తెలిసింది. విశ్లేషకుల అంచనాలను కూడా బ్యాంకు తప్పింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లు 1.68 శాతం నష్టంలో రూ.296.40 వద్ద ముగిశాయి. మార్కెట్ అవర్స్ తర్వాత ఎస్‌బీఐ తన ఫలితాలను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment