వాట్సాప్ మెసేజ్‌ల ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ స్కాం పై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సీరియస్‌గా స్పందించింది. వాట్సాప్ ద్వారా అందిస్తున్న అనధికారిక ట్రేడింగ్ టిప్స్‌పై విచారణ చేపట్టిన సెబీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇద్దరువ్యక్తులకు భారీ జరిమానా విధించింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి రిజిస్ట్రేషన్ పొందకుండా పెట్టుబడి సలహాలను వాట్సాప్ ద్వారా అందిస్తున్న ఇద్దరు వ్యక్తులకు భారీ జరిమానా విధించింది. మస్సూర్ రఫిఖ్ ఖాందా, ఫిరోజ్ రఫిక్ ఖంధాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల ఫైన్ విధించింది.
పలు పేరొందిన బ్రోకరేజి సంస్థల పేరుతో లిస్టెడ్ కంపెనీల సమాచారం ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాల ద్వారా ట్రేడంగ్ టిప్స్ అందిస్తాయి. పెట్టుబడిదారులకు ట్రేడింగ్ చిట్కాలు అందిస్తున్నాయని సెబీ విచారణలో తేలింది. అలాగే ఇందుకు పెద్ద మొత్తంలో ఖాతాదారులనుంచి వసూలు చేయడంతో పాటు.. భారీ రిటర్న్‌ను హామి ఇస్తాయి. ఉదాహరణకు రూ.25 వేలు డిపాజిట్ చేస్తే.. 200శాతం రిటర్న్ వస్తాయంటూ మెసేజ్‌లు వస్తాయి. దాదాపు నెలకు రూ.25-50లక్షలు వస్తాయని నమ్మిస్తాయి. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో సెబీ రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment