దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ లీకేజీ
శాయంపేట : భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి ఫేజ్–1 పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను పులుకుర్తి పంప్‌హౌస్‌కు దేవాదుల అధికారులు కొద్దిరోజులుగా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గోవిందాపూర్, పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామాల శివారులో ఉన్న ఫేజ్–1 పైప్‌లైన్ గేట్‌వాల్వ్ వద్ద రెండు రోజులుగా లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం పూర్తి స్థాయిలో గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో నీరు ఎగిసిపడింది. ఇలా బయటకు వచ్చిన నీరు పక్కనే ఉన్న ముప్పవాని చెరువులోకి చేరింది.