మెడికల్ ఎంసెట్ లీక్ పై చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
హైదరాబాద్: మెడికల్ ఎంసెట్ లీక్ పై చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై పరిశీలనలు జరపాలని నిర్ణయించింది. లీక్ వ్యవహారంపై సీఐడీ నివేదిక సీఎం కేసీఆర్ కు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో పరీక్షను రద్దు చేయాలా? లేదా అన్నదానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వ వర్గాలు విస్తృత సమాలోచనలు చేస్తోంది. సంబంధిత అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం అయ్యారు. ఈ కీలక సమావేశానికి జేఎన్ టీయూ వీసీ హాజరయ్యారు. మెడికల్ స్కాంలో జేఎన్ టీయూ సిబ్బందిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక వేళ పరీక్ష రద్దు చేస్తే తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతారని ప్రభుత్వం భావిస్తోంది.