న్యూ ఐఫోన్‌ ఫీచర్లు హల్‌చల్‌ | Apple iPhone X1 with renders triple camera leaked | Sakshi
Sakshi News home page

హువావే బాటలో యాపిల్‌: న్యూ ఐఫోన్‌ ఫీచర్లు హల్‌చల్‌

Published Mon, Jan 7 2019 9:44 AM | Last Updated on Mon, Jan 7 2019 10:58 AM

Apple iPhone X1 with renders triple camera leaked - Sakshi

మొబైల్‌ దిగ్గ‌జం యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తోంది. భవిష్యత్‌ ఐపోన్లను ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో తీసుకురానుందని తాజా సమాచారం. హువావే తరహాలో త‌న నూత‌న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను జోడించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన కొత్త ఐఫోన్ 11 ఇమేజ్‌లు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. 

హువావే మేట్‌ 20 ప్రొ  బాటలో యాపిల్ తరువాతి తరం ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు సమాచారం. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌లో డ్యుయల్‌ కెమెరాలను జోడించిన సంస్థ ఇపుడిక ట్రిపుల్‌ కెమెరాలతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తీసుకురానుంది. అలాగే మూడో కెమెరా 3డీ ఇమేజ్‌ల‌కు స‌పోర్ట్‌ను ఇవ్వనుందట. ప్ర‌స్తుతం ప‌లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు 3డీ ఆప్ష‌న్‌ను కెమెరాల‌కు ఇస్తున్నాయి. అదే కోవ‌లో యాపిల్ చేర‌నుంది. అలాగే కొత్త ఐఫోన్ల‌ను 2019, సెప్టెంబరు నాటికి అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా తాజా లీకులపై యాపిల్‌ అధికారికంగా స్పందించాల్సి వుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement