
కర్రీస్ పాయింట్‌లో గ్యాస్ సిలిండర్ లీక్
కూకట్‌పల్లి ఎల్లమ్మబండ ఇందిరా గాంధీ విగ్రహం వద్దనున్న ఓ కర్రీస్ పాయింట్‌లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : కూకట్‌పల్లి ఎల్లమ్మబండ ఇందిరా గాంధీ విగ్రహం వద్దనున్న ఓ కర్రీస్ పాయింట్‌లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్‌లో లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో కర్రీస్ పాయింట్‌లో పనిచేస్తున్న సుమన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని రెండు చేతులకు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అప్రమత్తమై మట్టితో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.