నీట్ పేపర్ లీకేజీలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన అవినాష్ అలియాస్ బంటీని అరెస్టు చేశారు. అనంతరం పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం సీబీఐ అతడిని జూలై 30 వరకు కస్టడీకి తీసుకుంది. నీట్ పేపర్ లీక్ కేసులో గతంలో అరెస్టయిన శశి పాసవాన్ బంధువు ఈ బంటీ కావడం గమనార్హం.
నీట్ పేపర్ ప్రశ్నాపత్రాల కీని షేర్ చేయడంలో బంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నీట్-యూజీ పరీక్ష తర్వాత పేపర్ లీకేజీ కోసం ఉపయోగించిన 16 ఫోన్‌లను సమీప చెరువులో పడేయగా.. కేసు విచారణ నిమిత్తం.. ఫోన్‌లను పడేసిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి గుర్తించారు.
కాగా, నీట్ పేపర్ లీకేజీపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. పరీక్షకు ముందే నీట్ పేపర్ ప్రశ్నాపత్రాలను పొందేందుకు రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అధిక మొత్తంలో చెల్లించినట్లు సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
బీహార్ అభ్యర్థులు రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి రూ.55 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు చెల్లించినట్లు విచారణలో తేలింది. హజారీబాగ్ (జార్ఖండ్), లాతూర్ (మహారాష్ట్ర), గోద్రా (గుజరాత్), పాట్నా (బీహార్)లలో పరీక్షా కేంద్రాలను గుర్తించడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 150 మంది అభ్యర్థులు లీకైన పేపర్ల నుండి ప్రయోజనం పొందినట్లు జాతీయమీడియా కథనాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment