సూర్యాపేట : ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.
ఎంసెట్–2 పేపర్ లీకేజీ చేసిన వారిని శిక్షించాలి : సంకినేని
Published Thu, Jul 28 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
సూర్యాపేట : ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్‌లో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలన్నారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు నలగుంట్ల అయోధ్య, హబీద్, చల్లమల్ల నర్సింహ, కొండేటి ఏడుకొండల్, బండపల్లి పాండురంగాచారి, జీడి భిక్షం, పొదిల రాంబాబు, వెంకట్‌రెడ్డి, అనంతుల యాదగిరి, జనార్దన్, కిరణ్, ఫణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement