Published
Sat, Jul 30 2016 8:36 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
సూర్యాపేట టౌన్ : ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ధర్మభిక్షం భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎంసెట్ –2 పేపర్ లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. సంబంధిత అధికారులు, వ్యక్తులపై సీబీఐతో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని, విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎంసెట్–2 లీకేజీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని, సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించాలన్నారు. వర్షాకాలంలో ప్రబలుతున్న అంటువ్యాధులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎల్, పట్టణ కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్ అనంతుల మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.