సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment